రిలయన్స్ జియో 2020 నూతన సంవత్సర కానుకగా అన్లిమిటెడ్ బంపర్ అఫర్
ఈ ప్లాన్ తీసుకొచ్చే ప్రయోజాలను మాత్రం బోలెడన్ని అని చెప్పొచ్చు.
టెలికం రంగంలో ప్రస్తుతం ఎదుర్కుంటున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అన్ని టెలికం సంస్థలు గట్టి పోటీని మరియు గడ్డుకాలాన్ని చవిచూడాల్సివస్తోంది. అయితే, రిలయన్స్ జియో మాత్రం 2020 నూతన సంవత్సర కానుకగా "2020 Happy New Year Offer" ఒక వినుతమైన మరియు సరికొత్త అన్లిమిటెడ్ బంపర్ అఫర్ ను ప్రకటించింది. ఈ అఫర్, స్మార్ట్ ఫోన్ మరియు జియో ఫీచర్ ఫోన్ కి కూడా వర్తిస్తుంది. ఈ ప్లాన్, 2020 రుపాయల ధరలో వస్తుంది. కానీ, ఈ ప్లాన్ తీసుకొచ్చే ప్రయోజాలను మాత్రం బోలెడన్ని అని చెప్పొచ్చు. ఈరోజు నుండి ఈ ఆఫరును అందుబాటులో తీసుకొచ్చింది. అయితే, ఇది కేవలం లిమిటెడ్ పిరియడ్ అఫర్ మాత్రమే అని చెబుతోంది.
Survey2020 Happy New Year Offer : ప్రయోజనాలు
ఈ 2020 Happy New Year Offer ని ఎంచుకునే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు పూర్తిగా ఒక సంవత్సరానికి గాను అన్లిమిటెడ్ సర్వీస్ అందుతుంది. కేవలం ఇదొక్కటే కాదు, జియో ఫీచర్ ఫోన్ కోసం ఈ అఫరును ఎంచుకునేవారికి ఒక JioPhone మరియు ఈ ఫోనుకు ఒక సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ సర్వీస్ కూడా అఫర్ చేస్తోంది. అంటే, పూర్తిగా 2020 సంవత్సరానికి గాను స్మార్ట్ ఫోన్ మరియు జియో ఫీచర్ ఫోనుకు కూడా అన్లిమిటెడ్ సర్వీసులు లభిస్తాయి.
ఇక ఈ అన్లిమిటెడ్ అఫర్ విషయానికి వస్తే, మీ స్మార్ట్ ఫోను యొక్క నంబరుకు 365 రోజుల వ్యాలిడిటీతో డైలీ 1.5 GB డేటా మరియు జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. ఇక Non-Jio అంటే ఇతర నెట్వర్క్ కాలింగ్ విహాసినికి వస్తే, ఈ పూర్తి వ్యాలీడీటీకి గాను 12,000 నిముషాల FUP లిమిట్ తో కాలింగ్ అఫర్ చేస్తోంది. అలాగే, డైలీ 100 SMS లను కూడా అందిస్తోంది.
జియో ఫీచర్ ఫోన్ ప్రయోజనాలు
ఈ ఆఫరుతో మీకు లభించే జియోఫోనుతో కూడా మీ 365 రోజుల అన్లిమిటెడ్ సర్వీస్ లభిస్తుంది. ఇందులో భాగంగా, జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 500MB హై స్పీడ్ డేటా మరియు ఉచిత SMS లు ఇస్తోంది. ఇక ఇతర నెట్వర్క్ కాలింగ్ కోసం మీకు FUP వర్తిస్తుంది.