TRAI కనుక ఈ రూల్ తెచ్చిందంటే, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మరియు జియో ధరలను మరింతగా పెంచవచ్చు.

TRAI కనుక ఈ రూల్ తెచ్చిందంటే, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మరియు జియో ధరలను మరింతగా పెంచవచ్చు.
HIGHLIGHTS

వినియోగదారులు మాత్రం రీచార్జి కోసం ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం ఆపరేటర్లకు టారిఫ్ లను నియంత్రించటానికి ప్రయత్నిస్తున్న కొత్త కన్సల్టేషన్ పేపర్ ని రూపొందించింది. ప్రస్తుతం, టెలికం ఆపరేటర్లకు తమకు నచ్చిన విధంగా సుంకాలను నిర్ణయించే స్వేచ్ఛ ఉంది, కానీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్నతీవ్రమైన పోటీ వారిని అలా అనుమతించదు. ఏదేమైనా, "టెలికాం సర్వీసెస్ యొక్క టారిఫ్ ఇష్యూస్" అనే కన్సల్టేషన్ పేపర్ ఫ్లోర్ ప్రైస్ టెల్కోస్ సేవలను నిర్ణయించే సూచనలను అన్వేషిస్తుంది.  అంటే అన్ని టెలికం సంస్థలు దానికి కట్టుబడి ఉండాలి మరియు వారి ప్రణాళికలను సాధారణ ధర వద్ద ప్రారంభించాలి, ఒకవేళ ఇది గనుక సెట్ చేయబడితే. టెలికాం ఆపరేటర్లకు ఫ్లోర్ ధరలను నిర్ణయించాలని ట్రాయ్ నిర్ణయించుకుంటే, భారతి ఎయిర్టెల్ మరియు వోడాఫోన్-ఐడియా వంటి సంస్థలు తక్కువ టారిఫ్ ధరలతో ఆదాయాన్ని సంపాదించడానికి కష్టపడుతున్నందున, దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతాయి.

రిలయన్స్ జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుండి, పోటీదారులకు అందనంత ఎత్తులో ఉండటానికి, తమ ధరలను తగ్గించమని ప్రత్యర్థి టెలికంలను  బలవంతం చేస్తోంది. ఒకవేళ ఫ్లోర్ ధర నిర్ణయించబడితే, ఇక రిలయన్స్ జియో కూడా ఒక నిర్దిష్ట పాయింట్ కంటే తక్కువ టారిఫ్ ధరలను ఉంచలేదు కాబట్టి అది తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ చర్య అన్ని టెలికాం ఆపరేటర్లకు సంబంధం లేకుండా ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది మరియు ఈ రంగం కోలుకోవడానికి  సహాయపడుతుంది. కాని వచ్చిన చిక్కల్లా, వినియోగదారులు మాత్రం రీచార్జి కోసం ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులేటరీ అథారిటీ ఫ్లోర్ టారిఫ్ ఫిక్సేషన్ కోరుతూ చేసిన అభ్యర్ధనతో పాటు టెలికాం ఆపరేటర్ల నుండి వారు పడుతున్న ఆర్ధిక కష్టాల గురించిన విన్నపాలు వచ్చాయని ట్రాయ్ తెలిపింది.

"అథారిటీ (TRAI) ఈ అంశంపై సంప్రదింపుల పత్రాన్ని తేలుకోవాలని నిర్ణయించింది, తద్వారా వాల్యూ చైన్ లోని వాటాదారులందరూ ఈ చర్చలలో పూర్తిగా పాల్గొనడానికి మరియు వినియోగదారుల ఆసక్తిని ప్రభావితం చేసే ఇటువంటి కీలకమైన సమస్యలపై వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం లభిస్తుంది" అని TRAI Media రిలీజ్ లో పేర్కొంది. కన్సల్టేషన్ పేపర్‌ ను ఇప్పుడే ప్రవేశపెట్టనప్పటికీ, ఈ సమస్యపై 2020 జనవరి 17 లోగా, జనవరి 31, 2020 నాటికి ప్రతివాద వ్యాఖ్యలను ట్రాయ్ ఆహ్వానిస్తోంది. కాబట్టి, కొత్త ఫ్లోర్ కారణంగా సుంకం ధరలు పెరుగుతాయని ఊహించలేము.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo