లెనోవా Z 6 Pro సేల్ మొదలయింది : 48MP క్వాడ్ కెమేరా, SD855, AMOLED డిస్ప్లే మరెన్నో ప్రత్యేకతలు

HIGHLIGHTS

ఒక 27W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 4,000 mAh బ్యాటరీని కూడా అందించారు.

లెనోవా Z 6 Pro సేల్ మొదలయింది : 48MP క్వాడ్ కెమేరా, SD855, AMOLED డిస్ప్లే మరెన్నో ప్రత్యేకతలు

లెనోవా భారతదేశంలో గొప్ప ఫీచర్లతో లాంచనంగా విడుదల చేసిన Z 6 Pro యొక్క సేల్ మొదలయింది. ఈ ఫోన్‌,  ఒక 6.39-అంగుళాల FHD+, AMOLED డిస్ప్లే మరియు వెనుక భాగంలో 48MP ప్రధాన కెమేరాగల క్వాడ్ రియర్ కెమేరా సెటప్పుతో వస్తుంది. అలాగే, ఈ ఫోనులో ప్రధాన ప్రాసెసర్ అయినటువంటి, స్నాప్‌డ్రాగన్ 855 SoC అమర్చారు. దీనిలో, వినియోగదారులు 8GB RAM ను పొందుతారు మరియు ఈ ఫోన్ బాక్స్ నుండి బయటకి వస్తూనే Android 9.0 తో నడుస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

లెనోవా జెడ్ 6 ప్రో ధరలు

లెనోవా జెడ్ 6 ప్రో (8GB + 128GB ) -Rs.33,999 

లెనోవా జెడ్ 6 ప్రో : ప్రత్యేకతలు

ఈ లెనోవా జెడ్ 6 ప్రో, ఒక 6.39-అంగుళాల పూర్తి హెచ్‌డి + అమోలెడ్ డిస్ప్లేని 1080 × 2340 పిక్సెల్స్ రిజల్యూషనుతో, ఒక 19.5: 9 యాస్పెక్ట్ రేషియాతో మరియు డిసిఐ-పి 3 కలర్ గాముట్ గల HDR 10 డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోనులో, 7nm ఫైన్ ఫిట్ టెక్నాలజీ గల ఒక స్నాప్‌డ్రాగన్ 855 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో లభిస్తుంది, ఇది అడ్రినో 640 GPU తో వస్తుంది. ఈ ఫోన్ బాక్స్ నుండి బయటకి వస్తూనే Android 9.0 తో నడుస్తుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే,  ఈ లెనోవా జెడ్ 6 ప్రోలో ఒక ప్రధాన 48 MP (f / 1.8) సెన్సార్‌ కి జతగా, మరొక 125 డిగ్రీల ఫీల్డ్ వ్యూ గల 16 MP లెన్స్ మరియు ఇంకొక 8 MP  మరియు 2 MP  సూపర్ వీడియో కెమెరాతో వస్తుంది. అలాగే, ముందు సెల్ఫీల కోసం ఒక 32 MP సెల్ఫీ కెమెరాను కూడా అందించారు. ఇక కనెక్టివిటీ ఫీచర్‌గా, ఫోన్‌లో 4 జీ VoLTE , డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 802.11, బ్లూటూత్ 5.0, జీపీఎస్ ఉన్నాయి. దీనిలో, ఒక  27W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా అందించారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo