ఈ క్వాల్కమ్ చిప్ సెట్ల ఫోన్లను వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

HIGHLIGHTS

క్వాల్కమ్ చిప్ సెట్ల పైన పట్టుసాధించిన 'Qualpwn' అని పిలువబడే బగ్ వలన కొన్ని కోట్ల ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్ల మరియు ట్యాబ్లెట్ యొక్క సెక్యూరిటీ రిస్క్ ఉంటుందని హెచ్చరించారు.

ఈ క్వాల్కమ్ చిప్ సెట్ల ఫోన్లను వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

టెన్సన్ట్ బ్లేడ్ టీమ్ యొక్క రీసెర్చర్లు, క్వాల్కమ్ చిప్ సెట్ల పైన పట్టుసాధించిన 'Qualpwn' అని పిలువబడే బగ్ వలన కొన్ని కోట్ల ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్ల మరియు ట్యాబ్లెట్ యొక్క సెక్యూరిటీ రిస్క్ ఉంటుందని హెచ్చరించారు. ఈ బగ్స్, హ్యాకర్లకు మీ ఫోన్ యొక్క రిమోట్ యాక్సెస్ ను చెయ్యడానికి, మీకు ఎటువంటి హెచ్చరిక సూచించకుండానే ఓవర్ -ది – ఎయిర్ (OTA) ద్వారా అందుకుంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీని ద్వారా మీ వై ఫై ఉపయోగించుకొని మీ డేటాని తస్కరించే వీలుంటుంది. ఇందులో మూడు రకాలైన బగ్స్ పాలుపంచుకుంటాయి. దీనిని 'Qualpwn' అనే కోడ్ నేమ్ తో పిలుస్తున్నారు. అయితే, మీ డేటాని దొంగిలించాలంటే మీరు మరియు హ్యాకర్ ఇద్దరూ కూడా ఒకే వై- ఫై కనెక్ట్ పైన ఉండాల్సివుంటుంది. అప్పుడు, మాత్రమే మీకు నష్టం కలిగించే వీలుంటుంది. కానీ ఇందులో ఇంకా ఇంప్రూవ్ మెంట్ సాధిస్తే మీకు ఎటువంటి సంభంధం లేకుండానే యాక్సెస్ చెయ్యవచ్చు.

 క్వాల్కమ్ యొక్క ప్రధాన చిప్సెట్ లను ఎక్కువగా ఈ బాగ్స్ వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. అంటే, స్నాప్డ్ డ్రాగన్ నుండి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి  ప్రధాన చిప్సెట్లయినటువంటి SD 855, 845, 835,730,712, 710, 675, 670, 660,636 వాటి 10 చిప్సెట్ తో నడిచే ఫోన్ల పైన ఈ ప్రభావం ఉంటుంది. దీనర్ధం, కొత్తగా వచ్చిన ఈ ప్రాసెసర్ తో లాంచ్ అయినటువంటి, OnePlus7, OnePlus7 pro, రెడ్మి K20 ప్రో, రెడ్మి K20, ఒప్పో రెనో, గూగుల్ పిక్సెల్ 3,గూగుల్ పిక్సెల్ 3 Xl, రెడ్మి నోట్ 7 ప్రో, వివో Z1 ప్రో,ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఫోన్లు ఈ లిస్టులోకి వస్తాయి. ఎందుకంటే, మంచి ప్రాసెసరుగా పేరుపొందిన ఈ కంపెనీ యొక్క చిప్ సెట్లను చాలా మొబైల్ తయారీ కంపెనీలు వాడుతాయి కాబట్టి.                    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo