OPPO K3 ఫ్లాష్ సేల్ 12 గంటలకి : రూ.16,990 ధర గల ఫోన్ను రూ.14,990 ధరకే ఈ విధంగా కొనవచ్చు
ఒక 6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది.
పాప్ అప్ సెల్ఫీ కెమేరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మంచి ప్రాసెసర్ ఒకటేమిటి పూర్తిగా మంచి ట్రెండీ ప్రత్యేకతలతో వచ్చిన ఒప్పో K3 మరొక ఫ్లాష్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ ఇండియా నుండి జరగనుంది. ఈ ఫోన్, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది.
Surveyవాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రారంభ వేరియంట్ అయినా 6GB ర్యామ్ ఫోన్ రూ.16,990 ధరతో ఉండగా, అమేజాన్ ఇండియా ద్వారా అమేజాన్ పే ద్వారా 1000 రుపాయలు మరియు Axis బ్యాంకు యొక్క క్రెడిట్ EMI ద్వారా కొనేవారికి 1,000 డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రెండు ఎంపికలతో కొనుగోలు చేసేవారికి కేవలం రూ.14,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. అధనంగా, Axis బ్యాంక్ క్రెడిట్ & డెబిట్ కార్డుతో నేరుగా కొనేవారికి 750 రూపాయల డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
OPPO K3 ధరలు
1. OPPO K3 (6GB + 64GB ) ధర : Rs.16,990
2. OPPO K3 (8GB + 128GB ) ధర : Rs.19,990
OPPO K3 ప్రత్యేకతలు
ఈ ఫోన్ కళ్లకు ఎటువంటి హాని చెయ్యని Eye ప్రొటక్షన్ గల ఒక 6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా గరిష్టంగా 6GB / 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. అలాగే, ఇది 64GB / 128GB వంటి స్టోరేజి ఎంపికతో ఎంచకోవచ్చు. ఇందులో ఒక 3765 mAh బ్యాటరీని అందించారు. అయితే, ఇందులో అందించిన VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ ద్వారా ఇది 25% తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ చేయగలదు.
ఇక కెమేరాల విభాగానికి వస్తే, వెనుక ఒక 16MP ప్రధానమైన గొప్ప కెమెరాతో పాటుగా 2MP డెప్త్ గల డ్యూయల్ కెమేరాని అందించారు. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించినట్లు కూడా స్పష్టం చేసింది. ఇక ఈ ఫోనుతో భారీ గేమ్స్ ఆడుకోవటానికి వీలుగా Game Boost 2.0 ని కూడా అందించింది. అలాగే, చక్కని సౌండ్ కోసం Dolby Atmos ని ఈ ఫోనులో ఇచ్చింది. సెల్ఫీల కోసం ఇందులో ఒక 16MP పాప్ అప్ సెల్ఫీ కెమెరాని కూడా అందించింది.