వివో Z1 ప్రో ఫ్లాష్ సేల్ 12 గంటలకి : చౌక ధరలో బెస్ట్ గేమింగ్ మరియు కెమేరా ఫోన్

HIGHLIGHTS

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి.

వివో Z1 ప్రో ఫ్లాష్ సేల్  12 గంటలకి : చౌక ధరలో బెస్ట్ గేమింగ్ మరియు కెమేరా ఫోన్

 కేవలం మిడ్ రేంజ్ ధరలో ట్రిపుల్ కెమేరా, పంచ్ హోల్ డిజైన్, బెస్ట్ ప్రాసెసర్ మరియు బెస్ట్ బ్యాటరీ వంటి అన్ని లక్షణాలతో, ఈ వివో Z1 ప్రో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ మల్టీ టర్బో ఫీచర్లతో వస్తుంది కాబట్టి ఇందులో గేమింగ్ చాలా సాఫీగా సాగుతుంది మరియు PUBG మరియు ఎక్కువ గ్రాఫిక్స్ కలిగిన పెద్ద గేమ్ ల కోసం ప్రత్యేకమైన ఫీచర్లను కూడా అందించింది.  ఈ ఫోన్ యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి జరగనుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వివో Z1 ప్రో : ధర మరియు ఆఫర్లు

1. వివో Z1 ప్రో  – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 14,990                                         

2. వివో Z1 ప్రో  – 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 16,999

3. వివో Z1 ప్రో  – 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 17,999

ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart నుండి Axis మరియు HDFC బ్యాంక్  క్రెడిట్ కార్డుతో  కొనుగోలు చేసేవారికీ 5% తగ్గింపు అందుకునే అవకాశం కూడా లభిస్తుంది.

VIVO Z1 PRO ప్రత్యేకతలు

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది

వివో Z1 ప్రో యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP మూడవ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 16MP సెన్సారు మరియు మరొక 8MP సూపర్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియార్ కెమేరాతో ఉంటుంది. ఈ వివో Z1 ప్రో యొక్క 16MP ప్[ప్రధాన కెమేరా f/1.78 అపర్చరుతో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది. ఇక ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 32MP కెమెరా ఉంటుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo