FaceApp ఫోటోలను రష్యాకి పంపుతుందని ఆరోపణ : అటువంటిది ఏమి లేదని చెబుతున్న యాజమాన్యం

HIGHLIGHTS

ఈ FaceAPP ఫోటోను ప్రాసెస్ చేసి ముసలి వారీగా లేదా యుక్త వయసు వారీగా చూపిస్తుంది.

FaceApp ఫోటోలను రష్యాకి పంపుతుందని ఆరోపణ : అటువంటిది ఏమి లేదని చెబుతున్న యాజమాన్యం

అసలేమిటి FaceApp అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఎక్కడ చూసినా, సినిమా హీరోలు, హీరోయిన్లు లేదా బాగా ఫేమస్ అయినా వారు ముసలి తనం వచ్చిన తరువాత ఎలా ఉంటారో అని చూపిస్తున్న ఫోటోలు ఈ ఆప్ నుండి తయారు చేసినవే. మీ ఫోనులో ఉన్న ఫోటో లేదా ఒక కొత్త ఫోటో తీసి ఇందులో అప్లోడ్ చేస్తే, ఆ ఫోటోను ప్రాసెస్ చేసి ముసలి వారీగా లేదా యుక్త వయసు వారీగా చూపిస్తుంది.         

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అటువంటి ఈ FaceAPP  ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ప్రజలు ఈ ఆప్ ను ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టారు అయితే, వారి ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడం ప్రారంభించినప్పుడు, వినియోగదారుల ప్రైవసీ కి సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఈ ఆప్ ఫోటోను మార్చే  ఫిల్టర్‌లను వర్తింపచేయడానికి / సవరణలు చేయడానికి మనం అందించింది వ్యక్తి యొక్క ఫోటోను ఉపయోగిస్తుంది. ఇది వారు అందించిన ఫోటోను ముసలి వారుగా లేదా యుక్త వయస్కులుగా కనబడేలా చేస్తుంది.

అయితే, ఈ ఫిల్టర్‌లను యాక్సెస్ చేయడనికి, కొత్త ఫోటో తియ్యడం లేదా ఫోన్ గ్యాలరీ నుండి ఫోటోను అప్ లోడ్ చేయాలి. తరువాత, లోకల్ స్టోరేజిలో నిల్వ చేసిన ఫోటోలను యాక్సెస్ చేయడానికి ఈ ఆప్ కి అనుమతి ఇవ్వాలి. Android మరియు iOS లలో అందుబాటులో ఉన్న ఈ ఆప్, కావలసిన రిజల్ట్ ఇవ్వడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. అందిన నివేదిక ప్రకారం, ఇందులో రెండు రెండు వివాస్పదమైన సమస్యలు ఉన్నాయి. మొదటది, ఫేస్ఆప్ అనే ఈ రష్యన్ స్టార్టప్ వినియోగదారుల ఫోటోలను క్లౌడ్‌లోకి అప్‌లోడ్ చేస్తుందని మరియు అది కూడా ఫోనులో ప్రాసెసింగ్ చేయలేదని వారికి స్పష్టం చేయకుండానే అలాచేస్తోందిని  ఆరోపించబడింది.

లోకల్  స్టోరేజి చేసిన ఫోటోలకు యాక్సెస్ ఇవ్వడాన్ని ఖండించిన iOS వినియోగదారులు రెండవ సమస్యని తెరపైకి తెచ్చారు. IOS ఆప్ సెట్టింగులను అధిగమిస్తోందని వారు ఆరోపించారు, ఎందుకంటే వారు ఈ ఆప్ కి  ఫోటో  యాక్సెస్ ని తిరస్కరించినా  కూడా వారి గ్యాలరీల నుండి చిత్రాన్ని లోడ్ చేయగలిగారు. ఇది వాస్తవానికి iOS లో అనుమతించబడదు. వినియోగదారులు ఫోటో యాక్సెస్ ను తిరస్కరించవచ్చు, కాని వారు కోరుకుంటే వ్యక్తిగత ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి ఎంచుకోవచ్చు.

FaceApp ఏజ్ ఫిల్టర్

ఈ ఆప్ యొక్క ఎఫెక్ట్ ను శక్తివంతం చేయడానికి అవసరమైన చాలా ప్రాసెసింగ్ క్లౌడ్‌లోనే జరిగిందని, కంపెనీ తరువాత ధృవీకరించింది. ఎడిటింగ్ కోసం ఎంచుకున్న ఫోటోలు మాత్రమే క్లౌడ్‌లోకి అప్‌లోడ్ అవుతాయని, మొత్తం గ్యాలరీకి కాదని ఇది పేర్కొంది. ఇది ఫోటోలను (యూజర్లు అప్‌లోడ్ చేయడానికి ఎంచుకున్నది) స్వల్ప సమయం కోసం మాత్రమే క్లౌడ్‌లో నిల్వ చేయవచ్చని కూడా స్పష్టం చేసింది, అయితే అవి అప్‌లోడ్ చేసిన తేదీ నుండి 48 గంటల్లో సర్వర్‌ల నుండి తొలగించబడతాయి, అని పేర్కొంది.

అయితే,  R&D టీమ్ మాత్రం, వినియోగదారు డేటా “రష్యాకు బదిలీ చేయబడదు” అని కూడా ఇది పేర్కొంది. ఫోటోలను ప్రాసెస్ చేయడానికి AWS మరియు గూగుల్ క్లౌడ్‌ను ఉపయోగిస్తుందని, ఈ ఆప్ వ్యవస్థాపకుడు యారోస్లావ్ గోంచరోవ్ చెప్పారు. "మేము ఏ యూజర్ డేటాను ఏ మూడవ పార్టీలతో పంచుకోము" అని ఇది సూచించింది, ఎక్కువ మంది ఫేస్ఆప్ వినియోగదారులు లాగిన్ అవ్వరు కాబట్టి ఫోటోలు మరియు వినియోగదారుల గుర్తింపుల మధ్య ఎటువంటి సంబంధం ఉండదు.

"మా సర్వర్ల నుండి వారి మొత్తం డేటాను తొలగించమని వినియోగదారుల నుండి అభ్యర్థనలను అంగీకరిస్తాము. మా మద్దతు బృందం ప్రస్తుతం ఓవర్‌లోడ్ చేయబడింది, కానీ వినియోగదారుల అభ్యర్థనలకు మేము ప్రాధాన్యత ఇస్తాము. వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం, ఫేస్ఆప్ మొబైల్ ఆప్ నుండి అభ్యర్ధనలను “సెట్టింగులు-> మద్దతు-> బగ్‌ను నివేదించండి” ఉపయోగించి సబ్జెక్ట్ లైన్‌లోని “గోప్యత” (ప్రైవసీ) అనే పదాన్ని పంపమని మేము సిఫార్సు చేస్తున్నాము. దాని కోసం మేము మంచి UI కోసం కృషి చేస్తున్నాము, ”అని ప్రకటనలో తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo