రియల్మీ X మరియు రియల్మీ 3i లను సేల్ కంటే ముందే చేతుల్లోకి తీసుకోవాలనుంటే ‘రియల్మీ ఫ్యాన్ మీట్’ కి విచ్చేయండి.

HIGHLIGHTS

రియల్మీ X మరియు రియల్మీ 3i స్మార్ట్ ఫోన్లను చేతిలోకి తీసుకొని దానితో గడిపే అవకాశం లభిస్తుంది.

రియల్మీ X  మరియు రియల్మీ 3i లను సేల్ కంటే ముందే చేతుల్లోకి తీసుకోవాలనుంటే ‘రియల్మీ ఫ్యాన్ మీట్’ కి విచ్చేయండి.

రియల్మీ తన రియల్మీ ఫ్యాన్స్ కోసం రియల్మీ X  ఎక్స్పీరియన్షియల్ ఫ్యాన్ మీట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం జూలై 20 వ తేదిన 13 పెద్ద నగరాలలో జరుగనుంది. ఇందులో, హైదరాబాద్, బెంగుళూరు,చెన్నై, ఢిల్లీ, ముంబై,కలకత్తా, జైపూర్, గౌహతి, లక్నౌ, అహ్మదాబాద్, పూణే, ఇండోర్ మరియు రాయపూర్ వంటి నగరాలు ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక ఈ రియల్మీ X  ఎక్స్పీరియన్షియల్ ఫ్యాన్ మీట్ కార్యక్రమం విషయానికి వస్తే, ఇది రియల్మీ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకముగా తీసుకొచ్చినట్లు చెబుతోంది. ఇందులో చాల కొద్దీ మందికే దొరికే పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి, ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారికి పాల్గొనే వారికీ అవకాశం దక్కవచ్చు. ఈ కార్యక్రమంలో, రియల్మీ కొత్తగా ఇండియాలో విడుదల చేసినటువంటి, రియల్మీ X మరియు రియల్మీ 3i స్మార్ట్ ఫోన్లను చేతిలోకి తీసుకొని దానితో గడిపే అవకాశం లభిస్తుంది.

అయితే, ఇందులో పాల్గొనడానికి కొన్ని షరతులను కూడా వర్తింపచేసింది.

ఈ క్రింద చూడండి.

1. ఈ కార్యక్రమంలో కేవలం భారతీయులు మాత్రమే పాల్గొనవచ్చు

2. ఎంచబడిన వారిని దగ్గరలోని సిటీ నుండి సంప్రదిస్తారు

3. ప్రయాణ / అకామిడేషన్ ఖర్చులతో రియల్మీ కి ఎటువంటి సంభందం ఉండవు

4. ఈ కార్యక్రమంలో జరిగే పోటీలో తుది విజేతను ఎంచుకోవడానికి, రియల్మీ పూర్తి హక్కును కలిగి ఉంటుంది.

వీటన్నిటికీ సిద్ధమైతే ఈ క్రింద అందించిన లింక్  ద్వారా మీరు మీ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు.

realme X and 3i Experiential Fan Meet ( LINK )

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo