రేపు ‘హానర్ 20 సిరిస్’ ఇండియాలో విడుదలకానుంది : ఇవే ప్రత్యేకతలు
హానర్ 20, 20 Pro మరియు 20i వంటి మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
హానర్ 20 సిరిస్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చేయడానికి, రేపటి డేట్ ను సెట్ చేసింది, హానర్ సంస్థ. రేపు ఉదయం 11:30 నిముషాలకు ఈ లాంచ్ ఈవెంట్ మొదలవుతుంది. ఇందులో భాగంగా, హానర్ 20, 20 Pro మరియు 20i వంటి మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంభంధంధించి, ఫ్లిప్కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఒక ప్రత్యేకమైన పేజీని కూడా నిర్వహిస్తోంది.
Surveyహానర్ 20 మరియు 20 ప్రో : ప్రత్యేకతలు
ఈ హానర్ 20 స్మార్ట్ ఫోన్ ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది. ముఖ్యంగా, ఇవి వెనుక భాగంలో ఒక క్వాడ్ రియర్ కెమేరా సెటప్పుతో వస్తుంది. హానర్ 20 లో, ప్రధాన కెమేరా f/1.4 అపర్చరు కలిగిన 48MP కెమేరా Sony IMX586 సెన్సారుతో వస్తుంది. ఇక దీనికి జతగా, 16MP సూపర్ వైడ్ యాంగిల్ కెమేరా, 2MP డెప్త్ కెమేరా మరియు 2MP మాక్రో కెమేరాలు ఉంటాయి. ఈ కేమెరాతో గొప్ప ఫోటోలతో పాటుగా అద్భుతమైన వీడియోలను కూడా తీసుకోవచ్చు. ఇక ముందుభాగంలో, ఒక 32MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. అయితే, 20ప్రో విషయానికి వస్తే ఈ కెమేరా సెటప్పులో 2MP డెప్త్ సెన్సింగ్ స్థానంలో ఒక 8MP టెలిఫోటో లెన్సును తీసుకొచ్చింది. దీనితో, 3X ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం అందిస్తుంది.
ఇక హానర్ 20ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, హువావే యొక్క ఇది 7nm హై ఎండ్ ప్రాసెసర్ అయినటువంటి Kirin 980 ఆక్టా కోర్ ప్రోసిజర్ శక్తితో నడుస్తుంది.
అయితే, చైనాలో ముందుగా విడుదలైనటువంటి హానర్ 20i దాదాపుగా అదే స్పెక్స్ తో లంచ్ కావచ్చని అనేక ఇప్పటి వరకు వచ్చిన అనేక అంచనాలు మరియు రూమర్లు చెబుతున్నాయి.
హావర్ 20i
20i లోఅందించిన వాటర్ డ్రాప్ నోచ్ ఒక U- ఆకారంలో చెయ్యబడింది మరియు ఇందులో ఒక సెల్ఫీ కెమేరాని కలిగి ఉంది, ఇది ఒక 6.21 అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ HD + రిజల్యూషనుతో వస్తుంది మరియు 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే, ఇది 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది.
ఈ ఫోను యొక్క ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా f / 2.0 ఎపర్చరుతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మల్టిఫుల్ ఫేస్ బఫరింగ్ ఫిచరును అందిస్తుంది. దీనితో పాటు, ఈ స్క్రీన్ ఫ్లాష్ లాగా కూడా మద్దతిస్తుంది.
ఇక రియర్ కెమేరా విషయానికి వస్తే, ఒక ఎపర్చరు F / 1.8 కలిగిన 24 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ మరియు దానికి జతగా రెండవ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా మరియు మూడవ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలిగి, ఈ 20i వెనుక AI ట్రిపుల్ కెమెరాని కలిగివుంది. ఈ కెమెరా, నైట్ సీన్ మోడ్, యాంటీ షేక్, సూపర్ Slo- మోషన్ వీడియో, ప్రొఫెషనల్ మోడ్, వైడ్ మరియు పోర్ట్రైట్ మోడ్ వంటి అనేక ఎంపికలతో పాటుగా వస్తుంది. ఈ ఫోన్ కిరిణ్ 710 SoC కి జతచేయబడిన 6 GB RAM శక్తితో పనిచేస్తుంది.
ఈ ఫోన్ వెనుక ప్యానెల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ముందు ఫేస్ అన్లాక్ ఫిచరుతో ఉంటుంది . ఈ ఫోన్ Android 9 పై ఆధారంగా EMU 9 తో పనిచేస్తుంది. ఈ పరికరంలో గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి గేమ్ టర్బో 2.0 జతచేయబడింది. కనెక్టివిటీ విషయానికి వస్తే, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n / AC, బ్లూటూత్ 4.2, జీపీఎస్, మైక్రోUSB 2.0, GPS మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ అందిస్తుంది.