ఇక ఫోన్ డిస్ప్లేలోనే కెమేరాలు : కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ
OPPO మరియు షావోమి రెండు కూడా వారి వారి కాన్సెప్ట్లతో బయటకి కనపడకుండా పూర్తిగా డిస్పీల్లో వుండే విధంగా కొత్త తరహా కెమేరా ఫోన్లను తీసుకురానున్నట్లు తెలిపింది.
ఇప్పటివరకూ, ఫుల్ వ్యూ, నోచ్, వాటర్ డ్రాప్ నోచ్ , పాప్ అప్, పంచ్ హోల్ ఇలాంటి పేర్లన్నీ కూడా సెల్ఫీ కేమెరా కోసం తీసుకొచ్చిన అనేకమైన ప్రయత్నాలుగా చెప్పొచ్చు. అయితే, OPPO సంస్థ వీటన్నిటిని పక్కన పెట్టి డిస్ప్లేలోపలే, బయటకి కనబడకుండా ఒక సెల్ఫ్ కెమేరాని అందించనున్నట్లు చెబుతోంది. తన ట్విట్టర్ పేజీలో అందించిన ఒక స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ వీడియోలో దీనికి సంబంధించిన విషయాన్ని చూపిస్తోంది.
Surveyఈ టీజింగ్ వీడియోలో, ఒక స్మార్ట్ ఫోన్, అతితక్కువ బెజెల్లతో ఎటువంటి నోచ్ లేకుండా కనిపిస్తుంది. దీనితో సెల్ఫీ ఫోటోను తీసేటప్పుడు మాత్రం డిస్ప్లేలోపల ఒక సెల్ఫీ కెమేరా ఉన్నట్లు కనిపిస్తుంది. అదీకూడా, కేవలం సెల్ఫీ కెమేరా ఎంపికలను ఎంచుకున్నప్పుడు మాత్రమే, ఆ సెల్ఫీ కెమేరా కనిపిస్తుంది. మాములుగా ఉన్నప్పుడు, ఇందులో ఒక సెల్ఫీ కెమేరా ఉన్నట్లు అస్సలు తెలియండలేదు.
ఇక ఇది ఇలా ఉండగా, ఈ వార్తను ప్రకటించిన కేవలం కొన్ని నిముషాల వ్యవధిలోనే షావోమి కూడా ఇదే తరహా టెక్నలాజితో స్మార్ట్ ఫోన్ను అందించనున్నట్లు, షావోమి సంస్థ కూడా ప్రకటించింది. ముందుగా, XDA డెవలపర్స్ అందించిన నివేదిక ప్రకారం, OPPO మరియు షావోమి రెండు కూడా వారి వారి కాన్సెప్ట్లతో బయటకి కనపడకుండా పూర్తిగా డిస్పీల్లో వుండే విధంగా కొత్త తరహా కెమేరా ఫోన్లను తీసుకురానున్నట్లు తెలిపింది.
అయితే, ఈ రెడింటిలో OPPO ఈ విధమైన కొత్త తరహా విధానంతో ముందుకొచ్చిన తరువాత కొన్ని నిముషాల వ్యవధిలో షావోమి దీని గురించి ప్రకటించి నాట్లు చెప్పడం విశేషం. ఈ విధంగా చూపించిన ప్రోటోటైప్ Mi9 గా ఆరోపించిన మరియు ఇది ఎప్పుడు ఆవిష్కరించనున్నారో కూడా తెలియపరచలేదని కోడా ఈ నిసీదికలో పేర్కొంది.