PUBG కొత్త అప్డేట్ 0.13.0 అదుర్స్ : సరికొత్త గన్స్ మరియు కొత్త మ్యాచ్ లను తెస్తుంది

HIGHLIGHTS

మీరు ఒక PUBG ప్లేయర్ అయితే మీకోసమే ఈ కొత్త న్యూస్.

ఇప్పుడు కొత్త అప్డేట్ అందిచడానికి PUBG సిద్దమవుతుంది.

PUBG కొత్త అప్డేట్ 0.13.0 అదుర్స్ : సరికొత్త గన్స్ మరియు కొత్త మ్యాచ్ లను తెస్తుంది

మీరు ఒక PUBG ప్లేయర్ అయితే మీకోసమే ఈ కొత్త న్యూస్. ఇప్పుడు కొత్త అప్డేట్ అందిచడానికి PUBG సిద్దమవుతుంది. ఈ కొత్త అప్డేట్ బీటా ఇప్పుడు రోల్ అవుట్ చెయ్యబడింది. ఈ బీటా అప్డేట్ 0.13.0 PUBG మొబైల్ కోసం తయారు చేసింది మరియు ఈ కొత్త బీటా వెర్షన్ డౌన్లోడ్ చేసుకోని సైన్ అప్ చేయాల్సివుంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Team  Death Match

ఈ కొత్త అప్డేటుతో ఏఎస్ సరికొత్త ఈవెంట్ మీకు అందించబడుతుంది. ఇది PUBG మొబైల్ కోసం కొత్త రీతుల్లో ఒకటి టీమ్ డెత్ మ్యాచ్ తీసుకొచ్చింది. ఈ పేరు సూచించినట్లుగానే, ఈ మోదులో రెండు జట్ల మధ్య పోటీ సాగుతుంది. ఈ మ్యాచ్ లో డెత్ గురించి మీకు పరిమితి లేదు. ఇవ్వబడిన సమయం ముగిసేలోపుగా ఎన్ని Kills సాధించారు అనేదాని పైనే టీమ్ విజయం ఆధారపడివుంటుంది. ఏదేమైనప్పటికీ, ఈ మ్యాచ్ చాలా తక్కువ సమయంతో ఉంటుంది మరియు ఇది  సుమారు 9-10 నిమిషాలలో ముగుస్తుంది. ఈ డెత్ మ్యాచ్ మోడ్ FPP మరియు TPP రెండింటిలో అందుబాటులో ఉంది.

2. గాడ్జిల్లా ఈవెంట్

PUBG మొబైల్ కూడా రాబోయే చలన చిత్రం గాడ్జిల్లా 2: కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఆటగాళ్ళు ఎరాంగెల్ మ్యాప్ లో, ఈ రాకాశిని  నీటిలో చూడవచ్చు మరియు ఒక ఈస్టర్ ఎగ్ ని కూడా అందుకుంటారు. అంతేకాదు, ఈ మ్యాప్ లో మీరు అతిపెద్ద పాదముద్రలను కూడా చూడవచ్చు.

3. Bizon Gun

ముందు నుండే PUBG PC లో అందుబాటులో ఉన్నటువంటి ఈ  గన్ న్నీ ఇప్పుడు PUBG మొబైల్ లో కూడా అందిస్తుంది. ఇది ఎక్కువ బులెట్లను స్టోరేజ్ చేయగల కెపాసిటితో వస్తుంది.       

ఈ కొత్త బీటా 0.13.0 అప్డేటులో భాగమైన ఇతర లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి

  • FPP కోసం ప్రత్యేకమైన కంట్రోల్ సెట్టింగులు చేర్చబడ్డాయి.
  • రిజల్ట్స్ లో MVP డిస్ప్లే జోడించబడింది.
  • జాబితాలో MVP emotes కోసం ట్యాబ్ ను కూడా జోడించారు.
  • అన్ని అప్పీయరెన్సులు, వాయిసెస్ మరియు emotes వివిధ పోర్టబుల్ అల్మారాలు సెట్ చేయవచ్చు. మ్యాచ్లో ఉన్నప్పుడు వారు కూడా మార్చవచ్చు.
  • వాకింగ్, క్రాల్ లేదా మంచు మీద వాహనాన్ని నడుపుతున్నప్పుడు, ఇక గుర్తులు కనబడతాయి.

అలాగే  మరికొన్ని మెరుగుదలలు కూడా ఉన్నాయి.

  •  ఆర్మర్ మన్నికను 25% తగ్గించవచ్చు (డామేజ్ రిడక్షన్ మాత్రం మారదు).
  • టైరెంట్, G , లికర్ మరియు జోంబీ కాప్ వంటివి సర్వైవ్ టిల్ డాన్ నుండి తీసివేయబడ్డాయి. అధనంగా, 4 కొత్త జాంబీస్ పరిచయం చేయబడుతుంది.
  • లిక్విడ్ నైట్రోజన్ మైన్ నుండి చల్లటి పొగమంచు ఇప్పుడు ఎక్కువసేపు ఉంటుంది. దీన్లో నుండి వెళ్లే ప్రతిదీ కూడా నెమ్మదిగా చెయ్యబడుతుంది.
  • న్యూ బిల్డింగ్ : అబాండన్డ్ ఫ్యాక్టరీ : ఈ బిల్డింగు చాలా రిసోర్సులు కలిగి ఉంది కానీ ఇందులో కొత్త బాస్ కూడా ఉంటాడు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo