ఇండియాలో షావోమి బ్లాక్ షార్క్ 2 లాంచ్ : గేమింగ్ ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్
ఈ స్మార్ట్ ఫోన్, లేటెస్ట్ మరియు అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసెరుతో వస్తుంది.
మార్చి నెలలో చైనాలో విడుదల చేసిన ఈ గేమింగ్ ప్రత్యేకమైన స్మృతి ఫోన్ షావోమి బ్లాక్ షార్క్ 2 ను, ఈ రోజు ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్దమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్, లేటెస్ట్ మరియు అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసెరుతో వస్తుంది. అంతేకాదు, ఒక పెద్ద 12GB ర్యామ్ జతగా ఇది చాలా స్పీడుగా పనిచేస్తుంది. ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి, Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ ద్వారా ఈ విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ షావోమి బ్లాక్ షార్క్ 2 యొక్క విద్డుదల కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటకి మొదలవుతుంది.
Surveyషావోమి బ్లాక్ షార్క్ 2 ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఒక మంచి రిజల్యూషన్ మరియు చక్కని వ్యూ అందించగల ఒక 6.39 అంగుళాల ట్రూ వ్యూ AMOLED డిస్ప్లేతో మరియు HDR సపోర్టుతో వస్తుంది. అంతేకాదు, ఈ అమోలెడ్ డిస్ప్లే ఇండిపెండెంట్ ఇమేజ్ ప్రాసెసింగ్ తో పాటుగా వస్తుంది. దీనితో గేమింగ్ సమయంలో మీకు చక్కని కలర్స్ మరియు డీప్ బ్లాక్ వాటి ఫీచర్లతో గొప్ప గేమింగ్ వ్యూ అనుభూతిని ఇస్తుంది. ఇక ఒక గేమింగ్ ఫోనులో కావాల్సిన గొప్ప ప్రాసెసర్ కూడా ఇందులో అందించారు. ఇది స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసెరుకి జతగా, గరిష్టంగా 12GB ర్యామ్ తో వస్తుంది. కాబట్టి, అవధులులేని గేమింగ్ స్పీడ్ అందుకోవచ్చు మరియు ఇందులో అందించిన డైరెక్ట్ టచ్ మల్టి లేయర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ తో ఫోన్ చల్లగా ఉండేలా చూస్తుంది.
ఐక్య కెమేరా విభాగానికి వస్తే, ఇందులో ఒక 48MP సెన్సార్ కలిగినటువంటి ప్రధాన కెమేరాకి జతగా మరొక 12MP కెమెరాని కలిపిన దూల కెమేరా అందించారు. అలాగే ముందుభాగంలో ఒక 20 MP సెల్ఫీ కెమేరాని కూడా ఇందులో ఇచ్చారు. ఇక ఈ ఫోనుకు తగినట్లుగా, వేగంగా ఛార్జ్ చేయగల సాంకేతికతతో కూడిన 4,000 mAh బేటరీ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ప్రత్యేకతలతో ఉంటుంది.