ఇప్పుడు జియో తో మీ నంబరును MNP చెయ్యడం చాల సులభం

HIGHLIGHTS

ఒక టెలికం నుండి మరొక టెలికం కోసం మీ నంబర్ను పోర్ట్ చేయడానికి ఈ విధానం దాదాపుగా అన్ని సంస్థలకు ఒకే విధంగా ఉంటుంది.

ఇప్పుడు జియో తో మీ నంబరును MNP చెయ్యడం చాల సులభం

ఇప్పుడు టెలికాం ఆపరేటర్లు ముందెన్నడూ చూడనటువంటి అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లతో సేవలను అందిస్తున్నారు. ఒక వైపున అధికమైన డేటాని అందిస్తూనే దానితో  పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా చక్కని ప్యాకేజీగా అందిస్తున్నారు. ప్రతి టెలికం కంపెనీ కూడా వారి యూజర్ బేస్ పెంచే విషయంలో అనేక కొత్త ప్రణాళికలను చేస్తున్నారు. ఈ విషయంలో, అన్ని టెలికాం కంపెనీల మధ్య  పెద్ద యుద్ధమే కొనసాగుతోందని చెప్పొచ్చు. వాస్తవానికి, ఇవి అందించే ఇంటర్నెట్ ద్వారా గొప్ప డిజిటల్ ప్రయోజనాలను  పొందొచ్చు. దీనికి అధనంగా, కాల్స్ మరియు SMS లను కూడా ఉచితంగా అందుకుంటున్నారు వినియోగదారులు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అటువంటి మంచి ప్యాకేజీలను మరియు సర్వీసును అందిస్తున్న వీటి యొక్క నెట్వర్క్ సరిగా లేకపోతే, అప్పుడు వినియోగదారులు ఉచిత డేటాని ఏమి చేసుకోవాలి?  కొన్ని సంస్థలు డేటా ప్రయోజనాలు మరియు మంచి రీఛార్జ్ ప్యాక్ లను ఇస్తున్నాకూడా, వినియోగదారులు తరచుగా నెట్వర్క్ సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నెట్వర్క్ వలన కొన్ని సార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. వినియోగదారులు ఒక సంస్థ నుండి మరొకదానికి పోర్ట్ చేయవలసి ఉంటుంది.

మీ నంబరును పోర్ట్  చేయడం కష్టంకాదు కాని, కొన్నిసార్లు మనం సరైన మార్గం తెలియక  కొంత ఇబ్బదిపడుతుంటాము. అయితే, ఈ ఆర్టికల్ ద్వారా మీకు సులభమైన మార్గాన్ని సూచిస్తున్నాను, కనుక మీరు జీయో నెట్వర్క్ కోసం మీ నంబరును ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ నబరుతో పోర్ట్ చెయ్యడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి. ఒక టెలికం నుండి మరొక టెలికం కోసం మీ  నంబర్ను పోర్ట్ చేయడానికి ఈ విధానం దాదాపుగా అన్ని సంస్థలకు ఒకే విధంగా ఉంటుంది.

Jio పోర్ట్ లో MNP చెయ్యడం ఎలాగా?

(రిలయన్స్ జియోకు మీ నంబరును పోర్ట్ చెయ్యడం గురించి)

1. మీ ఫోన్ మెసేజ్ బాక్స్ కు వెళ్లి, ఒక కొత్త మెసేజ్ టైప్ చేయడాన్ని ఎంచుకోండి.

2. ఇక్కడ PORT అని టైప్ చేసి స్పేస్ కొంత స్పెస్ ఇచ్చి తరువాత మీ మొబైల్ నంబర్ను నమోదు చేయండి,

 ఉదాహరణ : PORT 987654321

3. ఈ మెసేజీని 1900 నబరుకు పంపండి.

4. ఈ మెసేజీని పంపిన తరువాత, యు.పి.సి అని పిలువబడే ఒక ఏకైక పోర్టింగ్ కోడ్ను(యూనిక్ పోర్టింగ్ కోడ్)ని  మీరు అందుకుంటారు మరియు ఈ కోడుతో పాటుగా దాని గడువు తేదీ కూడా అందించబడుతుంది. (UPC 15 రోజుల వరకూ చెల్లుతుంది)

5. మీరు Jio స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్ను సందర్శించడం ద్వారా ఈ కోడ్నుసమర్పించవచ్చు. ఈ పోర్టు సంఖ్యకు మీరు మీ ఆధార్ కార్డును, మీ అడ్రస్ ప్రూఫ్ , ID ప్రూఫ్ మరియు జియో కనెక్షన్ డిజిటల్ KYC ప్రాసెసుతో పాటు జతచేయాలి.

6. ఇక ఇది అప్రూవ్ అయినా తరువాత మీ నంబర్ పోర్ట్ చేయబడుతుంది

7. మీరు పోస్ట్పెయిడ్ నంబర్ను పోర్ట్ చేస్తే, మీరు అన్ని మునుపటి బిల్లులను జమ చేయాలి మరియు మీ నంబరును పోర్ట్ చేయటానికి 7 రోజులు పడుతుంది.

ఇది ఒక ఆపరేటర్ గురించి మాత్రమే వివరించినా కూడా అన్నింటికీ ఇదే విధంగా వుంటుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo