రూ. 6,999 ధరలో మూడు కెమెరాలతో వచ్చిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ Flash sale మధ్యాహ్నం 12 గంటలకి
కేవలం ముందు కెమెరాలు మాత్రమే కాకుండా, వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ మరియు 3,500mAh బ్యాటరీతో ఈ ధరలో చాలా గొప్పగా ఉంటుంది.
అతితక్కువ ధరలో మూడు కెమేరాలతో, ఇండియాలో లభిస్తున్న ఏకైక స్మార్ట్ ఫోన్ Infinix Smart 3 Plus అనే అంటారందరు. ఎందుకంటే, ఇంత తక్కువ ధరలో మరే ఇతర బ్రాండ్ కూడా ఇటువంటి స్మార్ట్ ఫోన్ అందించకపోవడం ఇందుకు కారణం. కేవలం ముందు కెమెరాలు మాత్రమే కాకుండా, వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ మరియు 3,500mAh బ్యాటరీతో ఈ ధరలో చాలా గొప్పగా ఉంటుంది.
Surveyఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ : ధర మరియు ఆఫర్లు
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్, 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజి కలిగిన ఒకే వేరియంట్లో విడుదలైంది. ఈ ఫోన్ను 6నెలల EMI ఎంపికతో కొనుగోలు చేసేవారికి No Cost EMI అఫర్ కూడా అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ ఫోన్ను ICICI యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో కొనుగోలుచేసే వారికీ 5% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ప్రత్యేకతలు
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్, HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.21 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఇది 269ppi పిక్సెళ్ళ సాంద్రతను కలిగి, 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు ఒక 88 శాతం బాడీ-టూ-స్క్రీన్ రేషియాతో వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోను యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది ఇటీవల మీడియా టెక్ తాజాగా ప్రకటించిన 2.0GHz క్లాక్ స్పీడ్ చేయగల మీడియా టెక్ హీలియో A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో పాటుగా ఒక SD మెమొరీ కార్డ్ తో 256GB వరకూ స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.
ఇక ఇందులోని కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.8 అపర్చరు కలిగిన ఒక ప్రధాన కెమేరాతో పాటుగా ఒక 2MP కెమేరా మరియు మరొక లో లోట్ సెన్సార్ కలగలిపి అందించిన ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో ఒక 8MP AI కెమెరాతో వస్తుంది. అధనంగా, ఇది AI బొకే, AR స్టిక్కర్లు AI బ్యూటీ మోడ్ వంటి అనేక ప్రత్యేకమైన ఫిచర్లతో, ఈ కెమెరాలను అందించింది.
ఈ స్మార్ట్ ఫోన్, ఒక పెద్ద 3,500mAh బ్యాటరీ మరియు డ్యూయల్ 4G సపోర్టుతో వస్తుంది. ఇది ఇన్ఫినిక్స్ యొక్క సరికొత్త OS అయినటువంటి, XOS 5.0 ఆధారితంగా Android 9 Pie పైన నడుస్తుంది. ఇది బ్లూటూత్ 5.0 వెర్షన్ కి సపోర్ట్ చేస్తుంది మరియు ఒక 3.5 ఆడియో జాక్ తో వస్తుంది.