వాయిస్ కాల్స్, జీయో టీవీ సబ్ స్క్రిప్షన్ మరియు జియో ఆప్స్ అన్నింటిని కూడా కేవలం ఒకే ప్లానుతో అందించేలా, ఒక కొత్త "ట్రిపుల్ ప్లే" ప్లాన్ను తీసుకురావడానికి చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
GigaFiber ట్రిపుల్ ప్లాన్ 100GB హై-స్పీడ్ డేటా (100 Mbps వేగంతో), అపరిమిత వాయిస్ కాలింగ్, Jio ఆప్స్ యొక్క పోర్ట్ఫోలియో యాక్సెస్ మరియు Jio Home TV సబ్ స్క్రిప్షన్ని అందిస్తుంది.
టువంటి అంతరాయం మరియు ఆలస్యం లేకుండా గొప్ప స్పీడుతో సర్వీసులను అందుకోవచ్చు.
Jio సంస్థ, ఇప్పటికే ముంబై మరియు ఢిల్లీ వంటి నగరాల్లో దాని FTTH సేవలను పరీక్షించడం జరిగింది మరియు వాణిజ్యపరంగా త్వరలోనే భారతదేశం అంతటా దాని సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇటీవల, ET Telicom తన నివేదికలో ఈ విష్యం గురించి పేర్కొంది. దీని ప్రకారంగా చూస్తే, అతి త్వరలో అత్యంత వేగమైన హోమ్ బ్రాడ్ బ్యాండ్ అయినటువంటి జియో గిగా ఫైబర్ ఫైబర్ టూ హోమ్ (FTTH) సర్వీసును ప్రతి ఒక్కరు అందుకోనున్నారు.
Survey
✅ Thank you for completing the survey!
ముఖేష్ అంభానీ నేతృత్వంలోని, రిలయన్స్ జియో గిగా ఫైబర్ ఇక 1,600 సిటీలలో తన కార్యకలాపాలను సాగించనున్నట్లు, ఇది సాధారణ బ్రాడ్ బ్యాండ్ కంటే 20 నుండి 100 రేట్ల అధికమైన వేగంతో పనిచేయనునట్లు కూడా తెలుస్తోంది. కాబట్టి, ఎటువంటి అంతరాయం మరియు ఆలస్యం లేకుండా గొప్ప స్పీడుతో సర్వీసులను అందుకోవచ్చు. అధనంగా, ముందుగా ప్రకటించిన విధంగా, జియో తక్కువ రేటుతో తన సేవలను అందచనున్నట్లు ప్రకటించింది, కాబట్టి దీని ప్లాన్స్ కూడా తక్కువ ధరతో రావచ్చని అంచనా వేస్తున్నారు.
దీనితో పాటుగా, ఈ సంస్థ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, జీయో టీవీ సబ్ స్క్రిప్షన్ మరియు జియో ఆప్స్ అన్నింటిని కూడా కేవలం ఒకే ప్లానుతో అందించేలా, ఒక కొత్త "ట్రిపుల్ ప్లే" ప్లాన్ను తీసుకురావడానికి చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ముందుగా వచ్చిన కొన్ని కొన్ని నివేదికల ప్రకారం, కంపెనీ యొక్క వెబ్సైట్ లో Jio GigaFiber ఖాతాలో లాగ్ ఇన్ అయినప్పుడు ఇది కనిపించినట్లు చెబుతున్నాయి . అయితే, ఈ ప్లాన్ ధర ఇంకా తెలియరాలేదు. కానీ ఈ నివేదికల ప్రకారం, GigaFiber ట్రిపుల్ ప్లాన్ 100GB హై-స్పీడ్ డేటా (100 Mbps వేగంతో), అపరిమిత వాయిస్ కాలింగ్, Jio ఆప్స్ యొక్క పోర్ట్ఫోలియో యాక్సెస్ మరియు Jio Home TV సబ్ స్క్రిప్షన్ని అందిస్తుంది. జీయో హోమ్ టివి సబ్ స్క్రిప్షన్ గురించి ప్రస్తావిస్తూ, సంస్థ యొక్క IPTV సేవను Jio Home TV అని పిలుస్తారని తెలిపింది. ఈ ప్లాన్ ఒక 28-రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
జీయో ఫైబర్ వెబ్సైట్ ప్రకారం, 30 రోజులకు 500GB డేటా పరిమితితో వినియోగదారులకు 50MBPS వేగం అందించే ఒక ప్రాథమిక రూ.500 ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే, రూ. 999 ప్లానుతో 30 రోజులకుగాను 100MBPS స్పీడ్ మరియు 600GB డేటాను అందించే మరొక ప్లాన్, భారీస్థాయిలో ఇంటర్నెట్ వినియోగం అవసరమున్న వారికి 150 MBPS వేగంతో, 900 GB డేటా మరియు 30 రోజుల వ్యాలిడిటీతో కూడా అందిస్తోంది, అదికూడా కేవలం 1,500 రూపాయల వరకు ఎంపిక చేసుసుకునే విధంగా.