Realme 3 Pro ఒక 64MP అల్ట్రా HD తో ఫోటోలను తీసుకునే సమర్థయంతో వచ్చింది

HIGHLIGHTS

ఇందులో అందించిన కెమెరాతో 64MP రిజల్యూషన్ అందించగల అల్ట్రా HDR ఫోటోలను తీసుకోవచ్చని రియల్మీ ప్రకటించింది.

ఇందులో అందించిన ప్రత్యేకమైన ఫీచరుగా 960fps స్లో మోషన్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటి వాటిని గురించి చెప్పుకోవచ్చు

ఇందులో వేగవంతమైన ఛార్జింగ్ కోసం VooC 3.0 ఛార్జింగ్ సాంకేతికతను అందిచారు

Realme 3 Pro ఒక 64MP అల్ట్రా HD తో ఫోటోలను తీసుకునే సమర్థయంతో వచ్చింది

ఈ రోజు ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన లాంచ్ ఈవెంట్ లో లాంచనా ప్రాయంగా విడుదలైన Realme 3 Pro,  మంచి ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరు మరియు 4GB, 6GB ర్యామ్ ఎంపికలతో వచ్చిన బెస్ట్ ఫోనుగా చెప్పొచ్చు. ఇందులో అందించిన  16MP + 5MP డ్యూయల్ రియర్ కెమేరా ఒక 8 షాట్లను కలిపి ఒక 64MP అల్ట్రా HD ఫోటోగా అందించే ఫీచరుతో వస్తుంది.        

Digit.in Survey
✅ Thank you for completing the survey!

REALME 3 PRO ప్రత్యేకతలు

రియల్మీ 3 ప్రో  స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8%  స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు వెనుక ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.  అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్  2.2GHz వేగంతో క్లాక్ చేయబడిన, ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది.ఇది  64GB మరియు 128GB స్టోరేజితో వస్తుంది. అలాగే డ్యూయల్ SIM కార్డులతో పాటుగా ఒక SD మెమొరీ కార్డును కూడా ఒకేసారి వాడుకునేలా ట్రిపుల్ SIM స్లాట్ ఇందులో అందించారు.                

కెమేరాల విషయానికి వస్తే, వెనుక f /1.7 అపర్చరు కలిగిన 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519  సెన్సారుతో వస్తుంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందుభాగంలో ఒక 25MP AI సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.  ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా కలర్ OS 6 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4045mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది బాక్స్ నుండి 20వాట్స్ వేగవంతమైన చార్జరుతో వస్తుంది. ఇందులో వేగవంతమైన ఛార్జింగ్ కోసం VooC 3.0 ఛార్జింగ్ సాంకేతికతను అందిచారు, దీనితో అత్యంత వేగవంతంగా ఛార్జ్ చెయ్యవచ్చని సంస్థ చెబుతోంది. 

ఇక ఇందులో అందించిన ప్రత్యేకమైన ఫీచరుగా 960fps స్లో మోషన్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటి వాటిని గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో అందించిన కెమెరాతో 64MP రిజల్యూషన్ అందించగల అల్ట్రా HDR ఫోటోలను తీసుకోవచ్చని రియల్మీ ప్రకటించింది.అలాగే, లైటనింగ్ పర్పల్ , నైట్రో బ్లూ మరియు కార్బన్ గ్రే వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది.                            

రియల్మీ 3 ప్రో – ధర మరియు లాంచ్ ఆఫర్లు 

ఇది  4GB మరియు 6GB వేరియంట్ తో విడుదల చేయబడింది.

REALME 3 PRO (4GB ర్యామ్ + 64GB స్టోరేజి) – 13,999

REALME 3 PRO (6GB ర్యామ్ + 128GB స్టోరేజి) – 16,999

అంతేకాకుండా, ఫ్లిప్ కార్ట్ నుండి కొనుగోలు చేసేవారికి, No Cost EMI, 90% మరియు HDFC కార్డులతో కొనుగోలు చేసేవారికి 1000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, రిలయన్స్ జియో వినియోగదారులకి 5300 రూపాయల ప్రయోజనాలను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ Flipkart మరియు realme.com  నుండి ఏప్రిల్ 29 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo