మి ఫ్యాన్ ఫెస్టివల్ : షావోమి రెడ్మి గో mi.com మరియు Flipkart నుండి ఓపెన్ సేల్

HIGHLIGHTS

ఈ తక్కువ ధర స్మార్ట్ ఫోన్ను కొనుగోలు ధరలు ఎపుడైనా కొనే అవకాశం.

మి ఫ్యాన్ ఫెస్టివల్ : షావోమి రెడ్మి గో mi.com మరియు Flipkart నుండి ఓపెన్ సేల్

ఇటీవల షావోమి ఇండియాలో విడుదల చేసినటువంటి,Redmi Go బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు లిమిట్ గా సేల్ చెయ్యబడింది. ఇప్పటి వరకు ఫ్లాష్ సేల్ ద్వారా మాత్రమే అందుబాటులో వున్నా ఈ ఫోన్ను, ఈ మి ఫ్యాన్ ఫెస్టివల్ సందర్భముగా ఓపెన్ సేల్ కి ఉంచింది. షావోమి రెడ్మి గో ఇప్పుడు mi.com మరియు Flipkart నుండి ఓపెన్ సేల్ ద్వారా ఓపెన్ సేల్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్, రూ.4,499 రూపాయల ధరలో గొప్ప ఫీచర్లను అందిస్తుంది. ఈ   ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 425 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పాటుగా ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Go ఆఫర్లు

flipkart నుండి Axis బ్యాంక్ యొక్క Buzz క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ను కొనేవారికి, 5% డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, 6 నెలలకు గాను EMI ఎంపికతో కొనుగోలు చేసేవారికి, No Cost EMI కూడా అందుబాటులోవుంది, నెలకు కేవలం 750 రూపాయలు మాత్రమే చెల్లించాల్సివుంటుంది.                           

Redmi Go ప్రత్యేకతలు 

ఈ ఫోన్  16: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎగువ మరియు దిగువ భాగంలో మందపాటి అంచులు కలిగి ఉంటుంది మరియు ఈ డివైజ్ యొక్క వెనుకవైపు ఉన్న ఒక ఎడమ మూలలో సింగల్ కెమెరా మరియు ఫ్లాష్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ రెడ్మి గో 1280x720p రిజల్యూషను అందించగల, ఒక 5-అంగుళాల LCD HD డిస్ప్లేని కలిగి ఉంటుంది, ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 425 SoC తో నడుస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు పెంచుకునేలా,  8GB మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజికి జతగా 1 జీబి ర్యామ్ తో  ఈ హ్యాండ్ సెట్ లభిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక 8MP ఒకే వెనుక కెమెరాతో f / 2.0 ఎపర్చరు మరియు 1.12μm పిక్సెల్ పరిమాణంతో వస్తుంది. ముందు, ఇది ఒక 5MP సెన్సారుని కలిగివుంది.  ఇది 1.12μm పిక్సెల్ పరిమాణం మరియు ఒక f / 2/2 ఎపర్చరుతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ద్వారా నడిచే  ఈ హ్యాండ్సెట్, ఒక 3000 mAh బ్యాటరీ, మైక్రోUSB ఛార్జింగ్ పోర్టులతో వస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ కలర్ రకాలు మరియు డ్యూయల్ సిమ్ మద్దత్తుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, 20 కి పైగా భారతీయ భాషలను కలిగివుంటుంది మరియు ప్రత్యేకంగా హిందీ భాషలో "Google Assistance" ని కూడా కలిగివుంటుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo