హువావే P30 ప్రో కెమేరా శాంపిల్స్ మరియు ఫస్ట్ ఇంప్రషన్స్

HIGHLIGHTS

P30 ప్రో లెక్కలేనన్ని ఇన్నోవేటివ్ కెమేరా ఫిచర్లను తీసుకువస్తుంది.

హువావే P30 ప్రో కెమేరా శాంపిల్స్ మరియు ఫస్ట్ ఇంప్రషన్స్

Huawei P సిరీస్, ఇప్పుడు గత సంవత్సరం బెంచ్ మార్క్ సెట్ చేసిన ప్రముఖ p20 ప్రో తో పోలిస్తే, దాని ఫోటోగ్రఫీ సామర్థ్యాలకు నెక్స్ట్ లెవల్ గా మారింది. ఈ సంవత్సరం, గొప్ప కెమేరా ఫీచర్లతో Huawei P30 ప్రో ని విడుదల చేసింది హువావే, ఒక స్మార్ట్ ఫోన్ దీని కెమెరాతో, మరోసారి, కళ్లుచేదిరే ఫోటోలనుఅందించే ఫోనుగా ఉండనుండి. P30 ప్రోని ఉపయోగించినప్పుడు ఎటువంటి ఫోటోగ్రఫీని తీసుకునే అవకాశం ఉంటుందో తెలుసుకోవడానికి ఈ హువావే ఫోనుతో కొన్ని గంటలు పాటు చేసిన ఫోటో షూట్, ఇక్కడ అందిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రైమరీ కెమెరా

Huawei P30 ప్రో యొక్క ప్రాథమిక 40-మెగాపిక్సెల్ కెమెరా గత సంవత్సరం నుండి వాడుతున్నదే, ఇది ఒక కొత్త కెమేరా అయితే కాదు. ఇది కొత్తగా రూపొందించిన 1 / 1.7 అంగుళాల సెన్సార్, ఇది మేము హువావే రూపొందించిన మరియు సోనీ చేత తయారు చేయబడినది. Leica యొక్క లెన్స్ గరిష్ట కాంతి సేకరణ కోసం ఒక f / 1.6 అపర్చరుతో వస్తుంది, కానీ తక్కువ కాంతి సమయాలల్లో దాన్ని మెరుగుపరచడానికి, Huawei ఒక కొత్త Red-Yellow-Yellow-Blue పిక్సెల్ అరెంజ్మెంట్ చేసింది.

Huawei P30 ప్రో కెమెరా శాంపిల్ ఫోటోలు

Huawei P30 Pro Camera Samples

మా Flickr Gallery లో అన్ని పూర్తి రిజల్యూషన్ శాంపిల్ ఫోటోలు చూడటానికి ఇమేజి పైన క్లిక్ చేయండి

10 మరియు 40 మెగాపిక్సెల్స్ వద్ద రెండు ప్రైమరీ కెమెరా తో షూటింగ్ చేసినప్పుడు, ఒక విషయం స్పష్టమైనది. Huawei యొక్క JPG అల్గారిథం లాక్ డౌన్ ఫలితంగా చిత్రాలు చాలా ఆకట్టుకొనే వివరాలు తీసేలా ఉంది, ఫలితంగా అత్యంత స్పష్టమైన చిత్రాలను తీసుకునేలా ఉంటుంది. ఫోకస్ చాలా వేగంగా ఉంది మరియు సాధారణమైన చిత్రాలను కూడా చాలా అందంగా అందిస్తుంది. వాస్తవానికి, అందమైన ఫోటోలను తీయడం ఒక సులభమైన మరియు ఆనందించే అనుభవం. మీ కోసం కొన్ని నమూనా చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాము. 

Telephoto కెమెరా

ఇతర ఏకైక ఆస్పెక్ట్ సెట్టింగ్ ఏమిటంటే, Huawei P30 ప్రో 5-ఆప్టికల్ లెన్సును ఒక పెరీస్కోప్ స్టైల్ లెన్సుగా అందించే మొట్టమొదటి పరికరం. Oppo సంస్థ ముందుగా  ఈ కాన్సెప్ట్ ను ప్రదర్శించింది, కానీ ఎవరూ కూడా ఈ సాంకేతికతతో ఇలాంటి ఒక పరికరాన్ని మార్కెట్లోకి తీసుకురాలేదు. లైకా రూపొందించిన 5x ఆప్టికల్ లెన్స్ ఒక f / 3.4 ఎపర్చరును కలిగి ఉంటుంది, సుదీర్ఘ శ్రేణి కోసం ట్రేడ్ ఆఫ్ చేసింది. 5X ఆప్టికల్ జూమును 10x హైబ్రిడ్ జూముకు విస్తరించవచ్చు, ఇది వివిధ ఇమేజింగ్ సెన్సార్ల నుండి సమాచారాన్నిసేకరించి, ఆశ్చర్యకరంగా మంచి నాణ్యమైన చిత్రాలను అందిస్తుంది. 10x జూమ్ వద్ద షూట్ చేసి వివరాలను పరిశీలించాలని మేము భావించాము, ఆశ్చర్యకరంగా ఇందులో తీసిన ఫోటోలు ఆప్టికల్ లెన్సుతో తీసిన ఫోటోలవలే, స్పష్టంగా వచ్చాయి. ఈ 1/4 అంగుళాల సెన్సార్, f / 3.4 అపర్చరుతో జతచెయ్యడం వలన, ఎక్కువ కాంతిని స్వీకరించేలా సెన్సారుని పనిచేస్తుంది. హువాయ్ P30 ప్రో నుండి 5x మరియు 10x లలో శాంపిల్ ఫోటోలను తీశాము, ఈ క్రింద చూడవచ్చు.

ఫోటోలు 1x, 5x మరియు 10x వద్ద తీసిన శాంపిల్ ఫోటోలు

లో లైట్ ఫోటోగ్రఫీ

P30 ప్రో తక్కువ కాంతి లో కొన్ని స్టెల్లార్ చిత్రాలను తీయగలిగే సామర్ధ్యాన్ని కలిగివుంటుంది, అయితే ఇక్కడ చెప్పుకోదగిన గొప్ప విషయం ఏమిటంటే ఫోనులో నైట్  మోడ్ లేకుండానే ఇది చేయవచ్చని, Huawei పేర్కొంది. ఈ ఫిచరును ట్రై చేసి తెలుసుకోవడానికి, ప్యారిస్ లో మాకు తగిన సమయం లేదు, కానీ ఇక్కడ ఢిల్లీలో మా రివ్యూ యూనిట్టుతో చేసిన టెస్టింగులో, కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. హువాయి యొక్క వాదనల ప్రకారంగా సరిగ్గా వుంటుందో లేదో అని చూస్తే, ఇది మరింత ఇది పర్యావరణానుగుణంగా, తక్కువ కాంతి సామర్థ్యాలు కలిగి చాలా బాగా మరియు తక్కువ కాంతిలో ఎంత నిలకడగా ఉంటుందో చూడగలిగాము. మేము ఇప్పటివరకు చిత్రీకరించిన ఫోటోలు రెగ్యులర్ ఫోటో మోడ్ ఉపయోగించి చిత్రీకరించాము, నైట్ మోడ్ సెట్టింగులో ఎంతమాత్రమూ కాదు, ఇది ఫోటోలను తీయడానికి పలు ఫ్రేమ్లను తీసుకుంటుంది మరియు వాటిని కలిపి అందిస్తుంది.

ISO 51200 వద్ద షాట్

ISO 6400 వద్ద తీసిన షాట్

ఫస్ట్ ఇంప్రెషన్స్

Huawei P30 ప్రో, ఇటువంటి కెమెరా సెటప్ లేనటువంటి ఒక స్మార్ట్ ఫోనుగా కచ్చితంగా చెప్పవచ్చు. మేము చిత్రీకరించిన మరియు పరిశీలించిన చిత్రాలలో చాలా చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటానికి కారణాలు ఉన్నాయి, కానీ మేము పూర్తి రివ్యూ తో తిరిగి వస్తాము. అయితే, మేము శహోట్ చేసిన చిత్రాలను పైన చూపించిన వివరాలతో పూర్తి రిజయుషనులో చూడవచ్చు మరియు మీరు కూడా ఒక ఉద్దేశానికి రావచ్చు.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo