మీ EPFO పాస్ బుక్ ఆన్లైనులో డౌన్ లోడ్ చేసుకోవడం గురించి తెలుసుకోండి
చాల సంవత్సరాలనుండి పనిచేస్తున్నా మీ PF ఖాతాలో ఎంత డబ్బు జమయ్యిందో తెలియదా? అయితే ఇలా చేయండి.
అన్ని ప్రయివేట్, కార్పొరేట్, మరియు ప్రభుత్వంతో గుర్తిపు పొందిన సంస్థల్లో పనిచేసేవారికి కచ్చితంగా అందించాల్సిన ముఖ్యమైన భరోసా మొదటది అర్యోగం అయితే రెండవది భరోసా. అందుకోసమే, ఉద్యొగం చేసే ప్రతి ఒక్కరికి వారికీ ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగినప్పుడు ఉపయోగపడేలా ESI మరియు వృద్దాప్యంలో ఆదుకునేందుకు ఉపయోగపడేలా PF( ప్రావిడెంట్ ఫండ్ ) ని కచ్చితంగా ప్రతి కంపెనీ కూడా, అమలు చేయాల్సి ఉంటుంది.
Surveyఇది నిజంగా ఒక మంచి విషయమే అవుతుంది. అయితే, చాల మందికి వారి జీతం నుండి కొంత మరియు సంస్థ నుండి అదే మొత్తంలో జమ అవుతున్న, వారి యొక్క ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవు లేదా దాన్ని చేరుకోవడానికి సరైన మార్గాలు తెలియక పోవచ్చు. అందుకోసమే, ఈ శీర్షిక ద్వారా చాల సులభమైన పద్దతిలో మీ యొక్క PF ఖాతాలో వున్నా ఈ సేవింగ్స్ కి సంభంధించిన అన్ని వివరాలను తెలియ చేసే "EPFO Pass Book" ఎలా చూడాలి మరియు డౌన్ లోడ్ చేయాలి అనేవిషయాన్ని సవివరంగా అందిస్తున్నాను.
EPFO పాస్ బుక్ డౌన్ లోడ్ చేయడం ఎలా ?
1. ముందుగా https://www.epfindia.gov.in పేజీని ఓపెన్ చేయాలి
2. ఇక్కడ మీకు మొదటి హెడ్ లైన్ వరుసలో Our Service అని ఇకనిపిస్తుంది
3. ఇందులో మీరు For Employees అనే ఎంపిక పైన నొక్కాలి
3. ఇక్కడ మీరు Member Pass Book పైన నొక్కాలి
4. ఇప్పుడు సర్వీస్ యొక్క ప్రధాన పేజీకి మల్లించబడతారు
5. ఇక్కడ మీరు మీ పేరు మరియు పాస్వర్డును ఎంటర్ చేసి, క్రింద ఇచ్చిన Captcha ని కూడా ఎంటర్ చేసి లాగిన్ చేయండి
(ఇప్పటి వరకు మీ అకౌంట్ యాక్టివేట్ చేయకుంటే https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface లో నమోదు చేయాల్సి ఉంటుంది)
6. ఇక్కడ మీకు మీ Member ID కనిపిస్తుంది, దాని పైన నొక్కండి
7. మీ యొక్క PF Pass Book ఓపెన్ అవుతుంది,. ఇక్కడ కుడివైపున పై భాగంలో డౌన్ లోడ్ గుర్తు కనిపిస్తుంది దీని పైన నొక్కడంతో
మీ Pass Book డౌన్ లోడ్ అవుతుంది.