మిషన్ శక్తీ : యాంటీ మిసైల్ (ASAT)ని విజయవంతంగా పరీక్షించిన భారత్

HIGHLIGHTS

యాంటీ - శాటిలైట్ (ASAT) క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించిన ప్రధాని మోడీ.

మిషన్ శక్తీ :  యాంటీ మిసైల్ (ASAT)ని విజయవంతంగా పరీక్షించిన భారత్

భూమి కక్ష్యలో తక్కువ దూరంలో ఉన్న నిర్దిష్ట  ఉపగ్రహాన్ని ముందుగా నిర్ధేశించిన లక్ష్యాన్ని నాశనం చేసిన భారత ఉపగ్రహ యాంటీ – శాటిలైట్ (ASAT) క్షిపణిని  విజయవంతంగా పరీక్షించినట్లు , భారత ప్రధాని నరేంద్ర మోడి గారు ముందుగా ప్రకటించారు. ఇది మిషన్ శక్తిలో భాగంగా జరిగింది, చైనా, రష్యా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల తర్వాత తక్కువ-కక్ష్య ఉపగ్రహాలను ఛేదించగల సామర్ధ్యం కలిగిన దేశంగా, ప్రపంచంలో నాల్గవ స్థానంలో భారతదేశం నిలచింది. ASAT సిస్టం ఇప్పటి వరకు యుద్ధాల్లో ఉపయోగించనప్పటికీ, సాధారణంగా కొన్ని దేశాలు తమ సొంత ఉపగ్రహాలను (సాధారణంగా పనిచేయని వాటిని) నాశనం చేయడానికి ఉపయోగిస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఒక యాంటీ – శాటిలైట్ క్షిపణి (ఒక ASAT క్షిపణి లేదా ఒక ASAT సిస్టం కూడా పిలువబడుతుంది), ఒక క్షిపణిగా యుద్ధ విమానం నుండి లేదా ఒక క్షిపణి కేనిస్టర్ ఉపయోగించి భూమి నుండి ప్రయోగించబడుతుంది. తక్కువ భూ కక్ష్యలో (2,000 కిలోమీటర్ల దూరంలో) శత్రు ఉపగ్రహాలను నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగిన, ఒక ASAT క్షిపణి స్పేస్ యుద్ధంలో ఉపయోగించగల అంశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మిషన్ శక్తిలో భాగంగా ప్రస్తుతం DRDO  అభివృద్ధి చేసిన భారత్ ASAT క్షిపణితో  ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి 3 నిమిషాలు పట్టింది.

1980 ల ప్రారంభం వరకు రక్షణ వ్యూహాలలో ASAT క్షిపణులను నిర్మించడం మరియు పరీక్షించడానికి, అంతగా ప్రాధాన్యత చూపలేదు.1979 లో లాంచ్ చేయబడిన ఒక అమెరికన్ గామా కిరణ్ స్పెక్ట్రోస్కోపీ ఉపగ్రహామైన Solwind P78-1 ను నేలకూల్చడానికి, 1985సంవత్సరం,  సెప్టెంబర్ 13 న యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం నిర్మించిన ASM-135 ASAT తో, మోడిఫై చేసిన F-15 ఈగల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుండి ప్రయోగించింది.  సోవియట్ యూనియన్ కూడా దాని సొంత ట్రయిల్ ని అదే సమయంలో ప్రారంభించింది అయినప్పటికీ విజయవంతమైన ఒక ASAT మొదటి క్షిపణిగా గుర్తింపుపొందింది.

గత ఏడాది NDTV  నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో, DRDO  చైర్మన్ ఎస్ క్రిస్టోఫర్ భారతదేశ ఖండాతర బాలిస్టిక్ క్షిపణి, అగ్ని V గురించి మాట్లాడారు. అగ్ని V ను ASAT క్షిపణిగా ఉపయోగించవచ్చా? అని అడిగినప్పుడు, "మీరు సాధారణంగా ఏవైనా బాలిస్టిక్ క్షిపణిని వెయ్యి కిలోమీటర్లు కంటే అధికమైన ఎత్తు వరకు, వాటిని ప్రయోగించవచ్చు. మీరు ప్రత్యేకంగా అగ్నీ- V ను ఉపయోగించాల్సిన అవసరం లేదు" అని తెలిపారు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo