Nokia X71 ఏప్రిల్ 2న విడుదల : 48MP కెమేరా మరియు పంచ్ హోల్ డిస్ప్లేతో రానుంది

HIGHLIGHTS

ఈ ఫోన్ను నోకియా 8.1 ప్లస్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించవచ్చు.

Nokia X71 ఏప్రిల్ 2న విడుదల : 48MP కెమేరా మరియు పంచ్ హోల్ డిస్ప్లేతో రానుంది

నోకియా ఏప్రిల్ 2 న తైవాన్లో తన కొత్త నోకియా X71 స్మార్ట్ ఫోన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. GSMArena నివేదిక ప్రకారం,  ఈ కార్యక్రమాన్ని విడుదలను నిర్ధారిస్తూ మీడియాను ఆహ్వానించింది. ఈ ఫోన్ గురించిన అదనపు సమాచారం ఏమిటంటే, ఇది ఒక 48MP ప్రధాన వెనుక కెమెరాతో, ఒక కెమెరా-సెంట్రిక్ డివైజ్ గా సూచిస్తుంది. అయితే, ఈ 48MP సెన్సార్  సోనీ లేదా శామ్సంగ్ సెన్సార్ ని వినియోగిస్తుందా అనే దానిపై ఎలాంటి నిర్ధారణ లేదు. డిస్ప్లే  పరంగా, ఇది ఒక పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్ తో రానున్న, సంస్థ యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా దీని గురించి చెప్పవచ్చు. దీన్ని నోకియా 8.1 ప్లస్ గా  ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యవచ్చని ఊహిస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ లాంచ్ ఈవెంట్ ఒక 120 డిగ్రీ వైడ్-కోన్ లెన్స్ వంటి ఫోన్ యొక్క కొన్ని ముఖ్య స్పెసిఫికేషన్లను హైలైట్ చేస్తుంది, ఇది సెకండరీ సెన్సార్ కోసం ఉపయోగించబడుతుంది. గతంలో వెల్లడైన ఈ ఫోన్ యొక్క కొని చిత్రాలు డ్యూయల్ వెనుక కెమెరా సెటప్పుతో వచ్చింది. కానీ ముందు చెప్పినట్లుగా, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే, ఈ హ్యాండ్ సెట్ యొక్క చైనీస్ వేరియంట్ ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగి ఉన్నట్లు ఊహించబడింది, అయితే నోకియా 8.1 ప్లస్ డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది.

నోకియా 8.1 ప్లస్  పైన మునుపటి నివేదికలు, ఈ హ్యాండ్సెట్ను 6.22-అంగుళాల పూర్తి-HD + డిస్ప్లేతో ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఇది స్నాప్డ్రాగెన్ 710 SoC చేత శక్తినివ్వగలదు మరియు ఆండ్రాయిడ్ 9 పై OS పైన నడుస్తుంది. ఎప్పటిలాగే,  నోకియా 8.1 ప్లస్ కూడా ఒక Android One పరికరంగా ఉంటుంది, అయితే చైనాలో ప్రారంభించిన నోకియా X71 కు ఇది వర్తిస్తుంది.

Image Courtasy: 91 mobiles

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo