రియల్మీ U1 కేవలం రూ. 8,999 మాత్రమే

రియల్మీ U1 కేవలం రూ. 8,999 మాత్రమే
HIGHLIGHTS

అమేజాన్ ఇండియా అందిస్తున్న ఫ్యాబ్ ఫోన్ సేల్ నుండి ఒక మంచి డీల్.

రియల్మీ సంస్థ గత సంవత్సరం, ఒక మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసర్ తో నడిచే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టింది, అదే ఈ రియల్మీ U 1 స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ యొక్క సెల్ఫీ కెమేరా కోసం,  ఒక 25 MP కెమేరాని ఒక సోని IMX 576 సెన్సారుతో అందించింది. ఇటువంటి మరెన్నో ప్రత్యేకతలను కలిగిన స్మార్ట్ వాస్తవానికి, రూ. 12,999 ధరతో విడుదల అయ్యింది. అయితే, ప్రస్తుతం అమేజాన్ అందిస్తున్న ఫ్యాబ్ ఫోన్ సేల్ నుండి కేవలం రూ. 8,999 ధరతో దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ రియల్మీ U 1 యొక్క ధర రూ. 9,999 మనకు డిస్ప్లే పైన కనిపిస్తుంది, కానీ ఈ స్మార్ట్ ఫోన్ పైన అన్ని ప్రధాన బ్యాంక్ కార్డులతో కొనుగోలు పైన అమెజాన్ ఇండియా ఈ  సేల్ ద్వారా 1000 రూపాయల తక్షణ డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ. 8,999 ధరతో కొనవచ్చు. అలాగే, తమ పాత ఫోన్నీ ఈ ఫోనుతో ఎక్స్చేంజి చేయాలనుకున వారికి గరిష్టంగా 7,950 వరకు ఎక్స్చేంజి డిస్కౌంట్ ని కూడా అందుకుని అవకాశాన్ని కల్పించింది.                                  

Realme U1 ప్రత్యేకతలు

రియల్మీ U1 ఒక 6.3-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేను 90.8% స్క్రీన్ టూ బాడీ నిష్పత్తి మరియు ఒక 'డ్యూ డ్రాప్ నోచ్' తో కలిగి ఉంది.  ఈ స్మార్ట్ ఫోన్నీ అక్టోబర్ లో ప్రకటించారు. ఇది మీడియా టెక్ Helio P70 ఆక్టా కోర్ ప్రోసెసుతో నడుస్తుంది. ఈ హ్యాండ్సెట్, 3GB RAM మరియు 32GB స్టోరేజి మరియు మరొక 4GB RAM మరియు 64GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లలోవస్తుంది. ఇది AI పవర్ మాస్టర్ టెక్నాలజీతో 3500mAh బ్యాటరీ మద్దతుతో  వస్తుంది, ఈ టెక్నాలజీ   ఫోన్ యొక్క బ్యాటరీని విశ్లేషించడానికి మరియు దానికి సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫోనులో డ్యూయల్ సిమ్ తో పాటుగా,  మైక్రోSD స్లాట్ కూడా ఉంది.

రియల్మీ U1 2.5D గ్లాస్ ఫినిష్ మరియు  వేలిముద్ర సెన్సార్ కలిగి డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఇది 13MP + 2MP కెమెరా,  పోర్ట్రైట్ లైటింగ్, బోకె మరియు సూపర్ వివిద్ మోడ్లలో చిత్రాలను తీసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనితో HD రిజల్యూషనులో ఒక 90fps వద్ద స్లో-మోషన్ వీడియోను కూడా రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే, ఒక AI- శక్తితో కూడిన 25MP సెన్సార్ తో వస్తుంది, ఇది అధిక-రిజల్యూషన్ డెప్త్ ఇంజిన్ను "ఖచ్చితమైన" AI గుర్తింపుతో కలిగి ఉంటుంది. ముందు f2.0 ఆపేర్చేర్ మరియు 1.8 అంగుళాల పిక్సెల్ పరిమాణం ఉంది. ముందు కెమెరా హైబ్రిడ్ HDR, గ్రూప్  సెల్ఫీ ఫీచర్లు, సెల్ఫీ బోకె ప్రభావం మరియు AI ఫేస్ ఫెషియల్ డిటెక్షన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Android 8.1 Oreo తో నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo