రేపు విడుదలకానున్న Redmi Go

రేపు విడుదలకానున్న Redmi Go
HIGHLIGHTS

ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 425 SoC తో నడుస్తుంది.

ఇటీవల, షావోమి దాని రెడ్మి నోట్ 7 తో మరియు రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లను భారతదేశంలో విడుదలచేసింది. వాస్తవానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్లతో పాటుగా   ఒక Android Go- Powered స్మార్ట్ ఫోన్ అయిన ఈ  Redmi Go ని కూడా అనౌన్స్ చేయవచ్చని, చాల పుకార్లు వచ్చాయి. అయితే, ఆ సమయంలో కేవలం ఈ రెండు స్మార్ట్ ఫోన్లను మాత్రమే షావోమి విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఈ Redmi Go ని రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల చేయడానికి  సర్వం సిద్ధం చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ముందుగానే అంతర్జాతీయంగా విడుదల చేయబడింది మరియు ఇది గొప్ప ఫీచర్లని కలిగి ఉన్నాకూడా తక్కువ దరకే అందుతుంది.    

ఈ ఫోన్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, ఈ Redmi Go డిజైన్ పరంగా రెడ్మి 5A కు చాలా దగ్గరి పోలికను  కలిగివుంటుంది. ఈ ఫోన్  16: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎగువ మరియు దిగువ భాగంలో మందపాటి అంచులు కలిగి ఉంటుంది మరియు ఈ డివైజ్ యొక్క వెనుకవైపు ఉన్న ఒక ఎడమ మూలలో సింగల్ కెమెరా మరియు ఫ్లాష్ మాడ్యూల్ ఉన్నాయి.

హార్డ్వేర్ పరంగా, రెడ్మి గో 1280x720p రిజల్యూషను అందించగల, ఒక 5-అంగుళాల LCD HD డిస్ప్లేని కలిగి ఉంటుంది, ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 425 SoC తో నడుస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు పెంచుకునేలా,  8GB&16GB ఇంటర్నల్ స్టోరేజితో పాటుగా 1 జీబి ర్యామ్ తో జతగా ఈ హ్యాండ్ సెట్ లభిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక 8MP ఒకే వెనుక కెమెరాతో f / 2.0 ఎపర్చరు మరియు 1.12μm పిక్సెల్ పరిమాణంతో వస్తుంది. ముందు, ఇది ఒక 5MP సెన్సారుని కలిగివుంది.  ఇది 1.12μm పిక్సెల్ పరిమాణం మరియు ఒక f / 2/2 ఎపర్చరుతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ద్వారా నడిచే  ఈ హ్యాండ్సెట్, ఒక 3000 mAh బ్యాటరీ, మైక్రోUSB ఛార్జింగ్ పోర్టులతో వస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ కలర్ రకాలు మరియు డ్యూయల్ సిమ్ మద్దత్తుతో లభిస్తుంది. ఇక రేపు ఇండియాలో విడుదలయ్యే సమయానికి ఎటువంటి స్పీక్స్ అందిస్తుందో చూడాలి.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo