దూకుడు మీదున్న శామ్సంగ్ : A సిరీస్ నుండి సరికొత్త ఫోన్లు

దూకుడు మీదున్న శామ్సంగ్ : A సిరీస్ నుండి సరికొత్త ఫోన్లు
HIGHLIGHTS

శామ్సంగ్ తన వెబ్సైట్ లో A సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు చూపిస్తోంది.

శామ్సంగ్, తను కోల్పోయిన స్థానాన్ని చేజిక్కించుకునేందుకు మంచి దూకుడు మీదున్నట్లు కనిపిస్తోంది.  ఈ దక్షిణ కొరియా దిగ్గజం, ముందుగా M- సిరిస్ స్మార్ట్ ఫోన్లయిన గెలాక్సీ M10 మరియు M20 స్మార్ట్ ఫోన్లతో,  బడ్జెట్ మరియు మధ్యస్థాయి విభాగంలో మంచి పోటీని తీసుకువచ్చింది. ఇటీవలే, ప్రీమియం సెగ్మెంట్లో 5G మరియు ఫోల్డబుల్ ఫోన్లను ప్రకటించి తన సత్తాను చాటుకుంది. అలాగే, ప్రీమియం విభాగంలో మంచి ఫీచర్లతో ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి గెలాక్సీ S10E ని కూడా తీసుకొచ్చింది.

ఇక ఇప్పుడు, తన A సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు, శామ్సంగ్ యొక్క అధికారిక వెబ్సైట్ లో చూపిస్తోంది. అయితే, ఎటువంటి ఫోన్లను తీసుకురానుందో పూర్తి సమాచారం లేనప్పటికీ, వెబ్సైట్ లో చూపిస్తున్న టీజర్ల ను గమనిస్తే, కెమేరా, డిజైన్,డిస్ప్లే మరియు బ్యాటరీ వంటి అంశాలను హైలెట్ చేసి చుపిస్తోంది. కాబట్టి, ఈ విభాగాలలో మంచి ప్రత్యేకతలతో స్మార్ట్ ఫోన్లను అందిచడానికి చూస్తున్నట్లు అర్ధమవుతోంది.

 టీజర్లలో అందించిన వీడియోలో కెమేరా పరంగా, అల్ట్రా వైడ్ వీడియో, స్లో – మోషన్  మరియు హైపర్లాప్స్ వంటి ఫిచర్లను గురించి చూపించిన శాంపిల్ వీడియోలు చూడడానికి ఆకట్టుకుంటున్నాయి. అలాగే, అందించిన చిత్రాలను చూస్తుంటే, డ్యూయల్ మరియు ట్రిపుల్ రియర్ కెమేరా  సెటప్పు మరియు ఇన్ఫినిటీ డిస్ప్లేలతో ఈ స్మార్ట్ ఫోన్లను తీసుకురానున్నట్లు అనిపిస్తోంది. అయితే, ఇవన్నీ కూడా మన అంచనాలు మాత్రమే కాబట్టి, పూర్తి వివరాలకోసం  ఈ ఫోన్ విడుదల వరకు వేచిచూడాల్సిందే

చిత్ర మూలం : శామ్సంగ్ వెబ్సైట్ 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo