పుల్వామా అమర వీరుల కుటుంబాలకి సహాయం చేయాలనుకుంటున్నారా?

HIGHLIGHTS

Paytm మరియు PhonePay ద్వారా సులభంగా పంపవచ్చు.

పుల్వామా అమర వీరుల కుటుంబాలకి సహాయం చేయాలనుకుంటున్నారా?

పుల్వామాలో జరిగిన దాడిలో 40 కంటే ఎక్కువ మంది  సైనికులు అమరులైన విషాద ఘటన మనందరికీ తెలుసు. అయితే, అశువులుబాసిన ఆ అమరవీరుల కుటుంబాలకి, ప్రభుత్వాలు మరియు సెలబ్రెటీలు ఇంకా చాల మంది వారికీ తోచిన విధంగా సహాయ పడుతున్నారు. మీలో చాలామంది కూడా వారి కుటుంబానికి ఎంతోకొంత మీకు నచ్చిన సహాయం చేయాలనీ అనుకునే వారికోసం, చాల సులభపద్ధతిలో ఆన్లైన్ లో నేరుగా వారి సహాయనిధికి చేరేలా, Paytm మరియు PhonePay వాటి ప్లాట్ఫారల పైన ఒక మైక్రో సైట్ అందిచాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Paytm నుండి విరాళాన్ని పంపడం ఎలాగ ?

Paytm ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందించిన మైక్రో సైట్ పైన నొక్కడం ద్వారా, లోపలి వెళ్ళినతరువాత అక్కడ పైన మీకు విరాళాన్ని యెవరికి ఇస్తున్నారో ముందుగానే ఎంపికగా ఉంటుంది. ఇక్కడ   "CRPF Wives Welfare Association" అని ఉంటుంది. అంటే, మీరు పంపించే విరాళం నేరుగా వారి సహాయనిధికి చేరుతుందన్నమాట. ఇక్కడ మీ పేరు, PAN నంబరు (ఎక్కువ మొత్తంలో పంపితే మాత్రమే) నమోదుచేసి, మీకు తోచిన అమౌంట్ ని ఇక్కడ అందించి, మీ paytm వాల్లెట్ ల్దా అకౌంట్ నుండి నేరుగా పంపవచ్చు.   

PhonePe నుండి విరాళాన్ని పంపడం ఎలాగ ?

PhonePay  నుండి కూడా ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందించిన మైక్రో సైట్ పైన నొక్కడం ద్వారా, లోపలి వెళ్ళినతరువాత అక్కడ పైన మీకు విరాళాన్ని యెవరికి ఇస్తున్నారో ముందుగానే ఎంపికగా ఉంటుంది. ఇక్కడ   "Bharat ke Veer " పేరుతొ వుండే  SBI అకౌంట్ అని ఉంటుంది. అంటే, మీరు పంపించే విరాళం నేరుగా వారి సహాయనిధికి చేరుతుందన్నమాట. ఇక్కడ మీరు మీకు తోచిన అమౌంట్ ని ఇక్కడ అందించి, మీ అకౌంట్ నుండి నేరుగా Bharat ke Veer యొక్క SBI   అకౌంటుకు పంపవచ్చు.

మీకు నచ్చిన కుటుంబానికి నేరుగా పంపడం ఎలాగ ?

ఇండియన్ గవర్నమెంట్ అందిస్తున్న www.bharatkeveer.gov.in   వెబ్సైటు ద్వారా నేరుగా పంపవచ్చు.

లింక్ పైన క్లిక్ చేసి పేజిలోకి ప్రవేశించిన తరువాత,

1. ముందుగా అక్కడ అందించిన గైడ్ లైన్స్ చదివి తరువాత Click Here To Contribute పైన నొక్కండి

2. ఇక్కడ Bharat Ke Veer Corpus Fund అని కనిపిస్తుంది, దానిపైన నొక్కండి

3. ఇక్కడ మీ మొబైల్ నంబర్ పైన తెలిపిన సెక్యూరిటీ కోడ్ నమోదు చేసి ఎంటర్ చేయండి

4. ఇక్కడ మీకు ఒక OTP అందుతుంది. దీన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి

5. తరువాత, ఇక్కడ మీ పేరు, ఈ మెయిల్ ID మరియు సెక్యూరిటీ కోడ్ అందించి సబ్మిట్ చేయండి.

6. చివరిగా, మీ బ్యాంకును  ఎంచుకుని మీకు తోచిన అమౌంటును పంపించండి

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo