భారతదేశంలో వివో V15 ప్రో స్మార్ట్ ఫోన్ గ్రాండ్ ఎంట్రీ

భారతదేశంలో వివో V15 ప్రో స్మార్ట్ ఫోన్ గ్రాండ్ ఎంట్రీ
HIGHLIGHTS

ఈ పరికరం పాప్-అప్ ముందు కెమెరా మరియు ఇన్-డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంది.

వివో, భారతదేశంలో దాని వివో V15 ప్రో స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది, ఇది దాని పేరుకు 'ప్రపంచంలో మొదటిసారిగా' అని చాల ఫీచర్లను తగిలించుకుంది. ఈ  హ్యాండ్సెట్ 32MP ఫ్రంట్-ఫేసింగ్ పాప్-అప్ కెమెరాను కలిగి ఉంది మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  675 SoC చే శక్తిని కలిగి ఉంది, ఈ రెండు ఫీచర్లు ఈ  మొబైల్లో మొట్టమొదటివి. ఇది ఒక ఇన్ -డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంటుంది మరియు పాప్-అప్ ముందు కెమెరాకు దాదాపుగా అంచులు-తక్కువ డిస్ప్లే  డిజైన్ మరియు ఎటువంటి నోచ్ లేకుండా అందిస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లేలో ప్రాక్సిమిటీ మరియు ఆంబియంట్ లైట్ సెన్సార్ ను పొందుపరుచుకుంది , ఈ V15 pro  ఒక 91.6 స్క్రీన్ -టూ – బాడీ రేషియోని కలిగిఉంది.

వివో V15 ప్రో – ప్రత్యేకతలు

ఈ Vivo V15 Pro స్మార్ట్ ఫోన్,  19.5: 9 ఆస్పెక్ట్ రేషియాతో ఒక  6.32 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుంది. పైన పేర్కొన్న విధంగా, ప్రాక్సిమిటీ మరియు ఆంబియంట్ లైట్ సెన్సార్ ను డిస్ప్లేలో పొందుపరుచుకుంది మరియు ఈ ఫోన్ ఒక 91.64 స్క్రీన్ టూ బాడీ  నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఇది 0.37 సెకన్లలో ఫోన్ని  అన్లాక్ చేయగల ఒక ఇన్-డిస్ప్లే వేలిముద్ర సెన్సార్తో ఇది వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 675 ప్లాట్ఫాములో నాలుగో తరం kryo కోర్స్  మరియు హెక్సాగోన్ DSP లను కలిగి ఉన్న తొలి హ్యాండ్ సెట్ ఇది. ఈ ఫోన్, 128GB అంతర్గత  స్టోరేజితో 6GB RAM కలిగి వస్తుంది.

ఈ వివో V15 ప్రో అనేది ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉన్న మొదటి V- సిరీస్ ఫోన్. ఇది ఒక 48MP ప్రధాన కెమెరా, ఒక 8MP సూపర్ వైడ్-యాంగిల్  కెమెరాతో జతగా ఉంటుంది, ఇది 120-డిగ్రీ చిత్రాలను పసిగట్టగలుగుతుంది మరియు ఒక 5MP సెన్సార్ బొకేహ్ లను సంగ్రహించడానికి సహాయపడుతుంది .ఈ  48MP కెమెరా 4-in-1 పిక్సెల్ బిన్నింగ్ తో తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా మంచి నాణ్యత గల చిత్రాలను అందిస్తుందిని, Vivo చెబుతోంది. ఇది ముందు 32MP కెమెరాతో అమర్చబడి 3700 mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది మరియు 'డ్యూయల్-ఇంజిన్' ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. గేమింగ్ కోసం డ్యూయల్ టర్బో మోడ్ కూడా ఉంది, ఇది ఆప్ బూట్ టైమ్స్ ను 20 శాతం వరకు తగ్గించగలదని మరియు గేమింగ్ సమయంలో ఫోన్లో నేపథ్య అనువర్తనాలనుస్థిరపరచడానికి, 'ఇ-స్పోర్ట్స్ మోడ్' ఒక అల్గోరిథంను  సంస్థ దీనికి జోడించింది.

వివో V15 ప్రో లభ్యత, ప్రైసింగ్ మరియు  ఆఫర్స్

వివో V15 ప్రో 6GB RAM మరియు 128GB స్టోరేజి వెర్షన్తో వస్తుంది మరియు ఇది రూ 28.990 ధరగా నిర్ణయించబడయింది. ఇది టోపజ్ బ్లూ అండ్ రూబీ రెడ్ కలర్ మోడళ్లలో లభిస్తుంది మరియు ప్రీ-బుకింగ్స్ కోసం అందుబాటులో ఉంది, మార్చి 6 నుండి అమ్మకాలు మొదలవుతాయి. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్ వంటి వివిధ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఛానల్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్ లాంచ్ ఆఫర్లలని చూస్తే,  HDFC కార్డులతో 5 శాతం తక్షణ డిస్కౌంట్ ,HDFC  ఫస్ట్ బ్యాంక్ కస్టమర్లకు ఉచిత వన్-స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్, జీరో-డౌన్-చెల్లింపు ఆఫర్ అందిస్తుంది. అమెజాన్ నుండి, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ EMI లావాదేవీలతో 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు, మరియు ఎస్ బ్యాంక్ ఫోన్ బ్యాంక్ తో కొనుగోలు చేయడానికి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించినప్పుడు 10 శాతం తగ్గింపు పొందవచ్చు. జీయో వినియోగదారులు కూడా ఈ పరికరంతో 3.3TB 4G డేటాను పొందుతారు, కానీ వారు రూ .299 పధకంతో రీఛార్జ్ చేస్తేనే ఇది వర్తిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo