ఆండ్రాయిడ్ one సిరిస్ నుండి మరొక మోడల్, V2
By
Souvik Das |
Updated on 07-Dec-2015
గూగల్ సీఈఓ, Sundar Pichai ఇండియా కు వస్తున్నారు. డిజిటల్ ఇండియా లో గూగల్ ఇన్వాల్వ్మెంట్ కొరకు మాట్లాడటానికి నరేంద్ర మోడీ ను కలవనున్నారు.
Survey✅ Thank you for completing the survey!
అయితే తన మిగతా షెడ్యూల్ సంగతి ఇంతవరకు తెలియలేదు, కాని డిసెంబర్ 16 న ఈవెంట్ జరగనున్నట్లు మీడియాకు ఇన్వైట్ లు అందాయి.
సో ఈ ఈవెంట్ లో నెక్స్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ one ను లాంచ్ చేయనున్నారు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రపంచంలోని పెద్ద స్మార్ట్ os ఆపరేటింగ్ సిస్టం, ఆండ్రాయిడ్ గూగల్ సంస్థదే.
ఇది ఆండ్రాయిడ్ one అనే సిరిస్ పేరుతో థర్డ్ పార్టీ ఫోన్ కంపెనీలతో తక్కువ ధరకు ప్యూర్ ఆండ్రాయిడ్ ను అందించే దిశగా ఒప్పొండం కుదుర్చుకుంది.
అయితే ఇది మొదటి నుండి ఫ్లాప్ అయ్యింది. తాజాగా లావా పిక్సెల్ V1 కూడా ఫేల్యూర్ అయ్యింది మార్కెట్ లో. కారణం ఆసుస్, xiaomi, meizu, లెనోవో వంటి బ్రాండ్స్ కాంపిటిషన్.