Realme Buds Air 8: మాస్టర్ డిజైన్ మరియు LHDC తో లాంచ్ అవుతుంది.!

HIGHLIGHTS

రియల్‌మీ ఇప్పుడు ఇండియాలో చాలా వేగంగా తన ప్రొడక్ట్స్ విడుదల చేస్తోంది

ఇప్పుడు 2026 కొత్త సంవత్సరానికి తన కొత్త ప్రొడక్ట్స్ తో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది

రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 కూడా విడుదల చేస్తున్నట్లు తన కంప్లీట్ లైనప్ ను రివీల్ చేసింది

Realme Buds Air 8: మాస్టర్ డిజైన్ మరియు LHDC తో లాంచ్ అవుతుంది.!

Realme Buds Air 8 : రియల్‌మీ ఇప్పుడు ఇండియాలో చాలా వేగంగా తన ప్రొడక్ట్స్ విడుదల చేస్తోంది. ఈ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ ఇప్పుడు 2026 కొత్త సంవత్సరానికి తన కొత్త ప్రొడక్ట్స్ తో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది. ముందు రియల్‌మీ 16 ప్రో సిరీస్ లాంచ్ ని మాత్రమే అనౌన్స్ చేసిన కంపెనీ, ఇప్పుడు రియల్‌మీ పాడ్ మరియు రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 కూడా విడుదల చేస్తున్నట్లు తన కంప్లీట్ లైనప్ ను రివీల్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Buds Air 8: లాంచ్ డేట్?

2026 జనవరి 6న ఇండియాలో రియల్‌మీ ప్రత్యేకంగా నిర్వహించే ప్రత్యేకమైన లాంచ్ ఈవెంట్ నుంచి రియల్‌మీ 16 ప్రో సిరీస్, రియల్‌మీ పాడ్ 3 మరియు రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ఎయిర్ బడ్స్ కూడా విడుదల చేస్తుంది. ఇది 2026 కొత్త సంవత్సరం ప్రారంభంలో రియల్‌మీ నిర్వహించే పెద్ద ఈవెంట్ గా ఉంటుంది మరియు ఈసారి అన్ని కూడా ప్రీమియం సిరీస్ డివైజెస్ విడుదల చేస్తుంది.

Realme Buds Air 8: ఫీచర్స్

రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత ఇండస్ట్రియల్ డిజైనర్ Naoto Fukasawa తో కలిసి రియల్‌మీ ఈ కొత్త బడ్స్ డిజైన్ చేసింది. ఇది సరికొత్త మాస్టర్ డిజైన్ ఉంటుందని రియల్‌మీ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ మూడు కొత్త రంగుల్లో వస్తుంది. అయితే, రియల్‌మీ ఈ అప్ కమింగ్ బడ్స్ యొక్క కలర్ వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Realme Buds Air 8

ఈ బడ్స్ కేవలం డిజైన్ లో మాత్రమే కాదు సౌండ్ లో కూడా మాస్టర్ గా ఉంటుందని రియల్‌మీ చెబుతోంది. ఇందులో, LHDC మరియు Hi-Res Audio వైర్లెస్ ఫీచర్ తో లాంచ్ అవుతుంది. అంటే, ఇది అల్ట్రా క్లియర్ సౌండ్ యూజర్లకు ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ గురించి మరిన్ని వివరాలు కంపెనీ ఇంకా అందించాల్సి ఉంది. కానీ, ఈ అప్ కమింగ్ బడ్స్ యొక్క కొన్ని లీక్డ్ మరియు అంచనా ఫీచర్స్ ఆన్లైన్ లో దర్శనమిచ్చాయి.

Also Read: iPhone 16 పై ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ బిగ్ డీల్స్ అందుకోండి.!

రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8: అంచనా ఫీచర్స్

ఈ అప్ కమింగ్ బడ్స్ డ్యూయల్ డ్రైవర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అంటే, ఈ బడ్స్ లో 11 mm + 6 mm డ్యుయల్ డ్రైవర్స్ సెటప్ ఉంటుంది. ఇది గత సిరీస్ ద్వారా తీసుకోబడిన అంచనా ఫీచర్. ఇదే నిజం అయితే ఈ బడ్స్ మంచి బాస్ మరియు క్రిస్పీ సౌండ్ అందించే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ బడ్స్ 55dB ANC తో వచ్చే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. ఇది చెవుల వెలుపల శబ్దాలు పూర్తిగా నిలిపి వేస్తుంది. ఈ బడ్స్ AI సపోర్ట్ కూడా వస్తుందని చెబుతున్నారు. అయితే, ఈ బడ్స్ లాంచ్ నాటికి వీటిలో ఎన్ని ఫీచర్స్ అవుతాయని తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo