Realme Pad 3 లాంచ్ కోసం రంగం సిద్ధం.. బిగ్ టైటాన్ బ్యాటరీతో వస్తుంది.!
Realme Pad 3 ఇండియా లాంచ్ కోసం రియల్‌మీ టీజింగ్ ప్రారంభించింది
రియల్‌మీ 16 ప్రో సిరీస్ తో పాటు పాడ్ 3 కూడా లాంచ్ చేస్తుంది
ఈ అప్ కమింగ్ పాడ్ ను భారీ అంచనాలతో తీసుకొస్తున్నట్లు రియల్‌మీ చెబుతోంది
Realme Pad 3 ఇండియా లాంచ్ కోసం రియల్‌మీ టీజింగ్ ప్రారంభించింది. రియల్‌మీ 16 ప్రో సిరీస్ తో పాటు ఈ పాడ్ 3 కూడా లాంచ్ చేస్తుంది. ఈ అప్ కమింగ్ పాడ్ ను భారీ అంచనాలతో తీసుకొస్తున్నట్లు రియల్‌మీ చెబుతోంది. ఈ అప్ కమింగ్ పాడ్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ పాడ్ శక్తిని తెలియజేసే కొన్ని కీలక ఫీచర్స్ కూడా బయట పెట్టింది. ఇందులో బిగ్ టైటాన్ బ్యాటరీ ఉన్నట్లు రియల్‌మీ గొప్పగా చెబుతోంది.
SurveyRealme Pad 3 : లాంచ్ డేట్?
రియల్‌మీ పాడ్ 3 మరియు రియల్‌మీ 16 ప్రో సిరీస్ కూడా వచ్చే నెల అంటే, 2025 జనవరి 6న ఇండియాలో లాంచ్ అవుతాయి. అంతేకాదు, అదే రోజు రియల్‌మీ బడ్స్ ఎయిర్ ను కూడా లాంచ్ చేస్తుంది. అంటే, కొత్త సంవత్సరంలో రియల్‌మీ తన ప్రీమియం సిరీస్ ఫోన్ మరియు ప్రీమియం సిరీస్ డివైజ్ లను కూడా లాంచ్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది.
Realme Pad 3 : కీలక ఫీచర్స్
రియల్‌మీ పాడ్ 3 లాంచ్ కోసం టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ ఈ ప్రోడక్ట్ యొక్క కొన్ని ప్రధాన ఫీచర్స్ కూడా బయటకు వెల్లడించింది. ఇందులో ఈ పాడ్ బ్యాటరీ బాగా ఆకట్టుకునే ఫీచర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ పాడ్ ను భారీ 12,200 mAh టైటాన్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. అంతేకాదు, తక్కువ ఛార్జ్ చేయండి మరియు ఎక్కువ నేర్చుకోండి అని క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఎందుకంటే, ఇందులో Next Ai సపోర్ట్ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

ఈ ప్యాడ్ యొక్క మరో ఫీచర్ కూడా రియల్‌మీ వెల్లడించింది. అదేమిటంటే, ఈ ప్యాడ్ కలిగిన డిస్ప్లే ఫీచర్. రియల్‌మీ పాడ్ 3 లో 2.8K రిజల్యూషన్ కలిగిన బిగ్ అండ్ బు వ్యూ డిస్ప్లే ఉంటుంది. ఈ విషయాన్ని రియల్‌మీ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ డిస్ప్లే స్టయిల్స్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ వరకు మనం రియల్‌మీ అఫీషియల్ గా అందించిన ఫీచర్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ పాడ్ గురించి అంచనా ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం.
Also Read: Merry Christmas 2025 Telugu: విషెస్, మెసేజ్, కొటేషన్స్, ఇమేజెస్ అండ్ వాట్సాప్ స్టేటస్
అంచనా ఫీచర్స్?
ఈ పాడ్ 11.6 ఇంచ్ బిగ్ LCD ప్యానల్ తో లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది మంచి బ్రైట్నెస్ మరియు 2.8K రిజల్యూషన్ సపోర్ట్ తో ఉంటుంది. రియల్‌మీ పాడ్ 3 మీడియాటెక్ Dimensity 7300 Max 5G ప్రోసెసర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని కూడా చెబుతున్నారు. అంతేకాదు ఇది 8GB RAM మరియు 256GB బిగ్ స్టోరేజ్ తో వస్తుందని కూడా ఊహిస్తున్నారు. అయితే, ఈ పాడ్ యదార్ధమైన ఫీచర్స్ వచ్చే వరకు ఈ మాటల్లో ఎంత నిజం ఉందో చెప్పలేము.