Redmi Note 15 : లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్లు కూడా రివీల్ చేసింది.!
Redmi Note 15 ఇండియా లాంచ్ డేట్ ను ఎట్టకేలకు అనౌన్స్ చేసింది
న్యూ ఇయర్ న్యూ మొబైల్ ట్రెండ్ నే ఈసారి కూడా ఫాలో చేసింది
ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా మెల్లగా రివీల్ చేయడం ప్రారంభించింది
Redmi Note 15 : ఈ నెల ప్రారంభం నుంచి షియోమీ టీజింగ్ చేస్తున్న రెడ్ మీ నోట్ 15 ఇండియా లాంచ్ డేట్ ను ఎట్టకేలకు అనౌన్స్ చేసింది. షియోమీ మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తున్న ‘న్యూ ఇయర్ న్యూ మొబైల్’ ట్రెండ్ నే ఈసారి కూడా ఫాలో చేసింది. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను కూడా రాబోయే కొత్త సంవత్సరం ప్రారంభంలో లాంచ్ చేస్తుంది. గత రెండు వారాలుగా ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా మెల్లగా రివీల్ చేయడం ప్రారంభించింది.
SurveyRedmi Note 15 : ఎప్పుడు లాంచ్ అవుతుంది?
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో 2026 జనవరి 6వ తేదీన లాంచ్ చేయబోతున్నట్లు, షియోమీ డేట్ అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ నుంచి రీసెంట్ గా రెడ్ మీ 15C స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది మరియు ఇప్పుడు రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ ను కూడా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా నుంచి టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుందని క్లియర్ చేసింది.
Redmi Note 15 : కీలక ఫీచర్స్
ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే, కెమెరా, డిజైన్ మరియు బ్యాటరీ వివరాలు ఇప్పటి వరకు రెడ్ మీ రివీల్ చేసిన అంశాలు. ముందుగా ఈ ఫోన్ డిజైన్ చూస్తే, ఈ ఫోన్ కర్వుడ్ అండ్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ TUV ట్రిపుల్ ఐకేర్ సర్టిఫికేషన్ తో ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు హైడ్రో టచ్ 2.0 ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ లో భారీ డీటైల్ ఫోటోస్ అందించే 108MP ప్రైమరీ కెమెరా కలిగిన రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఇది ఒప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ (OIS) తో ఉంటుంది మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలియుగ ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: Truecaller Voicemail: ఆండ్రాయిడ్ యూజర్లకు ఉచితంగా AI ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ వచ్చేసింది.!
ఇక ప్రోసెసర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 6 Gen 3 తో లాంచ్ చేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్ కోసం అనువైన చిప్ సెట్ గా చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ సెటప్ గురించి కూడా రెడ్ మీ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఫోన్ లో 5520 mAh బిగ్ బ్యాటరీ ఉన్నట్లు రెడ్ మీ తెలిపింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ IP66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.