Truecaller Voicemail: ఆండ్రాయిడ్ యూజర్లకు ఉచితంగా AI ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ వచ్చేసింది.!

HIGHLIGHTS

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ప్రముఖ కాలర్ ఐడీ యాప్ ట్రూకాలర్

భారత ఆండ్రాయిడ్ యూజర్లకు Truecaller Voicemail ఫీచర్‌ విడుదల చేసింది

వాయిస్ మెసేజ్‌ ను వినాల్సిన అవసరం లేకుండా దాన్ని టెక్స్ట్ రూపంలో చదివే సౌకర్యం

Truecaller Voicemail: ఆండ్రాయిడ్ యూజర్లకు ఉచితంగా AI ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ వచ్చేసింది.!

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ప్రముఖ కాలర్ ఐడీ యాప్ ట్రూకాలర్, ఇప్పుడు భారత ఆండ్రాయిడ్ యూజర్లకు Truecaller Voicemail ఫీచర్‌ విడుదల చేసింది. AI ఆధారిత వాయిస్ టు టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్షన్ ను ఈ ఫీచర్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ తో ఫోన్ మిస్ అయినప్పుడు కాల్ చేసిన వ్యక్తి వదిలిన వాయిస్ మెసేజ్‌ ను వినాల్సిన అవసరం లేకుండా దాన్ని టెక్స్ట్ రూపంలో చదివే సౌకర్యం యూజర్లకు లభించనుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Truecaller Voicemail: ఏమిటి కొత్త అప్డేట్?

ట్రూకాలర్ వివరాల ప్రకారం, ఈ కొత్త వాయిస్ మెయిల్ సర్వీస్ యూజర్లకు పూర్తిగా ఉచితం మరియు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. సంప్రదాయ టెలికాం వాయిస్‌ మైల్‌ మాదిరిగా PIN నంబర్, డయల్ ఇన్ ప్రోసెస్ తో పని లేకుండా ఈ కొత్త ఫీచర్ నేరుగా ట్రూకాలర్ యాప్‌ లోనే లభిస్తుంది. ఈ కొత్త ఫీచర్ తో వచ్చే వాయిస్ మెసేజ్‌లు యూజర్ ఫోన్‌ లోనే స్టోర్ అవుతాయి కాబట్టి యూజర్ ప్రైవసీకి ఎటువంటి భంగం వాటిల్లదు మరియు వారికి అధిక భద్రత కూడా ఉంటుంది.

కొత్త ఫీచర్ లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ట్రూకాలర్ యొక్క AI ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ తెలుగు తో సహా మొత్తం 12 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఈ అవకాశం తో ప్రాంతీయ భాషల వినియోగదారులు కూడా తమకు వచ్చిన వాయిస్ మెసేజ్‌ ను సులభంగా అర్థం చేసుకునే వీలుంటుంది. ఇది మాత్రమే కాదు, స్పామ్ కాల్స్ నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్‌లను గుర్తించి వాటిని వేరు చేసే సామర్థ్యం కూడా ఈ కొత్త ఫీచర్ లో ఉంది.

ఇది ఆటొమ్యాటిగ్గా అప్డేట్ అయ్యే ఫీచర్ కాదు సుమ మీరు చిన్న ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేమిటంటే, ఈ కొత్త ఫీచర్‌ ను ఉపయోగించడానికి ట్రూకాలర్ యాప్‌ ను లేటెస్ట్ వెర్షన్‌ తో యూజర్లు అప్‌డేట్ చేసి ఈ యాప్ సెట్టింగ్స్‌ లో ‘Voicemail’ ఆప్షన్‌ ను ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసిన తర్వాత కాల్ మిస్ అయినప్పుడు, కాలర్ వాయిస్ మెసేజ్ పంపితే అది నేరుగా యాప్‌ లో కనిపిస్తుంది. అవసరమైతే వాయిస్ మెసేజ్‌ను వినొచ్చు లేదా AI రూపొందించిన టెక్స్ట్‌ రూపంలో చదవొచ్చు.

Also Read: YouTube Down: సతాయిస్తున్న యూట్యూబ్, వీడియో ప్లే చేయలేక యూజర్ల ఇక్కట్లు.!

ఇక ఈ ఫీచర్ గురించి టెక్ నిపుణుల వ్యక్తపరిచిన అభిప్రాయం ప్రకారం, ఈ కొత్త వాయిస్ మెయిల్ ఫీచర్‌ తో భారతీయ మార్కెట్‌ లో ట్రూకాలర్ తన స్థానాన్ని మరింత బలపరచుకొనే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు, బిజీగా ఉండే ఉద్యోగస్తులు మరియు తరచూ మిస్ కాల్స్ వచ్చే వారికి ఇది చాలా ఉపయోగకరంగా మారనుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo