Earbuds Buying Guide: కొత్త బడ్స్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.!
Bluetooth earbuds అనేది ప్రస్తుతం అత్యధికంగా వినియోగంలో ఉన్న ఆడియో పరికరం
ఈ ఆడియో పరికరం కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాలి
పరిశీలించడం ద్వారా మీకు అవసరమైన మరియు తగిన ఇయర్ బడ్స్ ఎంచుకోవచ్చు
Bluetooth earbuds అనేది ప్రస్తుతం అత్యధికంగా వినియోగంలో ఉన్న ఆడియో పరికరం. అయితే, ఈ ఆడియో పరికరం కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాలి. ఇలా పరిశీలించడం ద్వారా మీకు అవసరమైన మరియు తగిన ఇయర్ బడ్స్ ఎంచుకోవచ్చు. ఇలా మీకు మీకు తగిన బడ్స్ ఎంచుకోవడానికి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటో ఈ రోజు చూద్దాం.
Surveyకనెక్టివిటీ ఎంపిక
ఇయర్ బడ్స్ ఎంచుకునే ముందుగా ఆ బడ్స్ Bluetooth వర్షన్ చూసుకోవాలి. అంటే, Bluetooth 5.2 లేదా 5.3 లేదా వెర్షన్ 5.4 వంటి కొత్త వర్షన్లు ఉంటే మీ కనెక్షన్ చాలా స్టేబుల్ గా ఉంటుంది మరియు బడ్స్ బ్యాటరీ వినియోగం కూడా చాలా మినిమమ్ గా ఉంటుంది. అలాగే, గేమింగ్ లేదా వీడియో చూసేప్పుడు లాటెన్సీ కూడా తగ్గుతుంది. ఇక పాత Bluetooth వర్షన్ బడ్స్ తో పోలిస్తే కొత్త వెర్షన్ ఇయర్ బడ్స్ డైలీ యూజ్‌కు మరింత నమ్మకంగా ఉంటాయి.
సౌండ్ క్వాలిటీ
కనెక్టివిటీ తర్వాత మీరు చూడాల్సిన లేదా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం సౌండ్ క్వాలిటీ. పెద్ద స్పీకర్లు (సాధారణంగా 10mm నుంచి 13mm) ఉన్న ఇయర్ బడ్స్ లో BASS క్లారిటీ చాలా మెరుగ్గా ఉంటుంది. అలాగే, మీరు ఎంచుకునే ఇయర్ బడ్స్ లో AAC, aptX, LDAC వంటి ఆడియో కోడెక్స్ ఉంటే సౌండ్ ఇంకా నేచురల్‌గా మరియు క్లియర్‌గా వినిపిస్తుంది. ముఖ్యంగా, Android లేదా iPhone వాడే వారు తమ ఫోన్ కు సరిపడే కోడెక్ సపోర్ట్ ఉన్న బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఎంచుకోవాలి.
బ్యాటరీ లైఫ్
బ్యాటరీ లైఫ్ విషయంలో కూడా మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఇయర్ బడ్స్ బ్యాటరీ బ్యాకప్ తో మాత్రమే పని చేస్తాయి. అందుకే, ఒక్కసారి చార్జ్ చేస్తే కనీసం 5 నుంచి 8 గంటలు ప్లే టైమ్ కనీసం అందించే బడ్స్ చూడాలి. ఇయర్ బడ్స్ తో వచ్చే చార్జింగ్ కేస్ తో కలిపి 24 నుంచి 40 గంటల వరకు బ్యాకప్ ఇస్తే, అది డైలీ యూజ్‌కు చక్కగా సరిపోతుంది. అలాగే, ఇయర్ బడ్స్ లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటే, తక్కువ సమయం చార్జ్‌తో గంటలపాటు బ్యాకప్ అందుకోవచ్చు.

ANC ఫీచర్
బయట శబ్దం ఎక్కువగా ఉండే చోటుల్లో లేదా ఎక్కువగా ప్రయాణం లో ఉండేవారు ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) ఉన్న ఇయర్ బడ్స్ చాలా ఉపయోగపడతాయి. ఇవి బడ్స్ ధరించే వారి చుట్టూ ఉన్న రణగొణ శబ్దాన్ని తగ్గించి మ్యూజిక్ లేదా కాల్స్ పై యూజర్ ఫోకస్ పెంచుతాయి. అయితే, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉండే బడ్స్ చూడాలి. ఎందుకంటే, యూజర్ కు అవసరమైన సమయంలో అవసరమైనప్పుడు బయట శబ్దం కూడా వినిపిస్తుంది, ఇది ప్రయాణంలో లేదా కాల్స్ మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
గేమింగ్ కోసం
గేమింగ్ లేదా వీడియోలు ఎక్కువగా చూస్తే మీకు Low Latency / Gaming Mode ఉన్న ఇయర్ బడ్స్ సూట్ అవుతాయి. ఇది ఆడియో లేదా వీడియో మధ్య డిలే ను తగ్గిస్తుంది. అలాగే కాల్స్ క్వాలిటీ కోసం డ్యూయల్ లేదా క్వాడ్ మైక్‌లు, ENC లేదా AI నాయిస్ క్యాన్సలేషన్ కలిగిన మోడల్స్ మీకు బెటర్ ఆప్షన్స్ అవుతాయి.
IP రేటింగ్
వర్కవుట్ చేసే లేదా బయట ఎక్కువగా ఉండే వారు వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ కలిగిన బడ్స్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, వాటర్ లేదా స్వెట్ రెసిస్టెంట్ కలిగిన బడ్స్ చెమట మరియు నీరు నుంచి రక్షణ కలిగి ఉంటాయి. ఇందులో కనీసం IPX4 రేటింగ్ నుంచి ప్రారంభమయ్యే ఎఆర్ బడ్స్ అయితే చెమట లేదా తేలికపాటి వర్షం లో కూడా సురక్షితంగా వాడుకోవచ్చు.
Also Read: బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv కేవలం 26 వేల బడ్జెట్ లో లభిస్తోంది.. ఎక్కడంటే.!
చివరి మాట
చివరిగా మరియు ముఖ్యంగా చూడవలసిన విషయం బడ్జెట్. మీరు మీ బడ్జెట్ ను బట్టి ఒక గొప్ప ఆప్షన్ ను చేసుకోవాలి. రూ. 2,000 ధర లోపల సాధారణ డైలీ యూజ్ కు సరిపడే ఇయర్ బడ్స్ లభిస్తాయి. ఇక మిడ్ రేంజ్ ఇయర్ బడ్స్ విషయానికి వస్తే, రూ.2,000 నుంచి రూ. 4,000 మధ్య మిడ్ రేంజ్ బడ్జెట్లో మంచి సౌండ్, తగిన బ్యాటరీ మరియు రీజనబుల్ ANC కూడా లభిస్తుంది. ఒకవేళ మీ వద్ద అంతకంటే ఎక్కువ బడ్జెట్ ఉంటే మీరు ప్రీమియం సౌండ్, బెటర్ ANC, అద్భుతమైన కాల్ క్వాలిటీ ఉన్న ఇయర్ బడ్స్ పొందవచ్చు.
మొత్తానికి, మీ వాడుక అవసరాలు మరియు మీ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని దానికి అనుగుణంగా ఫీచర్లను చూసుకుని ఎంపిక చేస్తే సరైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ కొనుగోలు మీరు పొందవచ్చు.