OPPO Find X9: ఒప్పో కొత్త ఫోన్ కంప్లీట్ స్పెక్స్ అండ్ ప్రైస్ తెలుసుకోండి.!
OPPO Find X9 Series నుండి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ గా ప్రవేశపెట్టబడింది
బేసిక్ వేరియంట్ అయినా కూడా భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఆకట్టుకుంటుంది
OPPO Find X9 : ఒప్పో ఈరోజు ఇండియన్ మార్కెట్లో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. వీటిలో ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ గా ప్రవేశపెట్టబడింది. ఇది బేసిక్ వేరియంట్ అయినా కూడా భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ అండ్ ప్రైస్ తెలుసుకుందామా.
SurveyOPPO Find X9 : ప్రైస్
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్ మరియు రంగుల్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (12 జీబీ + 256 జీబీ) రూ. 74,999 ధరతో మరియు రెండో వేరియంట్ (16 జీబీ + 512 జీబీ) ను రూ. 84,999 పరిచే ట్యాగ్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ICICI, HDFC, SBI మరియు Kotak వంటి మేజర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% (రూ. 8,499) అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ తో ఉచిత Enco Buds 3 Pro+ ఎయిర్ బడ్స్ ఉచితంగా ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడు ప్రీ ఆర్డర్ కి అందుబాటులోకి వచ్చింది.
OPPO Find X9 : ఫీచర్స్
ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ లో 6.59 ఇంచ్ AMOLED డిస్ప్లే అందించింది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ మరియు 1800 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ డాల్బీ విజయం మరియు HDR 10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9500 చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా LPDDR5X 16 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ (UFS 4.1) స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ కలర్ OS సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.
కెమెరా పరంగా, ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 స్మార్ట్ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 50MP మెయిన్, 50MP టెలిఫోటో, 50MP వైడ్ యాంగిల్ సెన్సార్ లతో పాటు 2MP మోనోక్రోమ్ కెమెరా ఉంటాయి. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 120fps, 60fps, 30fps వద్ద వీడియో సపోర్ట్ మరియు గొప్ప కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఒప్పో ఫోన్ లో 120x AI టెలిస్కోపిక్ జూమ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
Also Read: Oppo Find X9 Pro భారీ 200MP సూపర్ క్వాడ్ కెమెరాతో లాంచ్ అయ్యింది.!
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 స్మార్ట్ ఫోన్ గూగుల్ జెమిని లైవ్ సపోర్ట్ తో గొప్ప Ai ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ ను ఎక్కువ సమయం నడిపించగల 7025 mAh బిగ్ బ్యాటరీ తో ఈ ఫోన్ ను అందించింది. ఇందులో 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కలిగి ఉంటుంది. IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఈ ఫోన్ ఉంటుంది.