BSNL Students Plan: అధిక డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలతో సూపర్ ప్లాన్ తెచ్చింది.!
బీఎస్ఎన్ఎల్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది
కొత్త ఆఫర్లు మరియు ప్లాన్లు కూడా తన యూజర్ల కోసం పరిచయం చేస్తోంది
2025 చిల్డ్రన్స్ డే సందర్భంగా స్టూడెంట్స్ కోసం కూడా కొత్త రీఛార్జ్ ప్లాన్ అందించింది
BSNL Students Plan: దేశంలో నెట్వర్క్ పరిధిని మరింత విస్తరించి నప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చౌక ధరలో గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్లు ఆఫర్ చేస్తున్న ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ, మరిన్ని కొత్త ఆఫర్లు మరియు ప్లాన్లు కూడా తన యూజర్ల కోసం పరిచయం చేస్తోంది. రీసెంట్ గా సీనియర్ సిటిజన్ కోసం మరియు కార్పొరేట్ ఎంప్లాయిస్ కోసం కొత్త ప్లాన్స్ అందించిన బిఎస్ఎన్ఎల్, ఇప్పుడు 2025 చిల్డ్రన్స్ డే సందర్భంగా స్టూడెంట్స్ కోసం కూడా కొత్త రీఛార్జ్ ప్లాన్ అందించింది.
SurveyBSNL Students Plan
2025 నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ని అందించింది. ఇది రెగ్యులర్ ప్లాన్ మాత్రం కాదు కేవలం లిమిటెడ్ టైం తో వచ్చిన లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ మాత్రమే. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది మరియు 2025 డిసెంబర్ 13వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే, బీఎస్ఎన్ఎల్ రూ. 251 రూపాయల స్టూడెంట్స్ రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్.

బీఎస్ఎన్ఎల్ రూ. 251 స్టూడెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను భారతీయ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇది అన్లిమిటెడ్ లాభాలు మరియు అధిక డేటా అందిస్తుంది. స్టూడెంట్ ఆన్లైన్ అవసరాలకు తగిన భారీ డేటాతో ఈ ప్లాన్ వస్తుంది.
Also Read: LG Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
రూ. 215 స్టూడెంట్స్ ప్లాన్ ప్రయోజనాలు
బీఎస్ఎన్ఎల్ రూ. 215 స్టూడెంట్స్ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ కలిగిన 28 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ అందిస్తుంది. అంతేకాదు, డైలీ 100 SMS ఒక ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ముఖ్యంగా, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 100GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ చవక ధరలో అధిక డేట్ మరియు అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్లాన్ గా ఉంటుంది.