Samsung Galaxy S24 FE 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది. అమెజాన్ ఇండియా అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. ఇండియాలో 60 వేల రూపాయల ప్రైస్ తో లాంచ్ అవ్వగా ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ తో కేవలం 30 వేల రూపాయల అతి చవక ధరలో లభిస్తోంది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy S24 FE 5G : ఆఫర్
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 59,999 ప్రైస్ ట్యాగ్ తో గత సంవత్సరం లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి రూ. 28,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 31,999 రూపాయల గొప్ప డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి 5% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 29,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 FE స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ డైనమిక్ AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు అధిక బ్రైట్నెస్ తో పాటు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4nm శాంసంగ్ సొంత చిప్ సెట్ Exynos 2400e తో నడుస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ గెలాక్సీ AI సపోర్ట్ తో వస్తుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 8MP (3x ఆప్టికల్ జూమ్) టెలిఫోటో కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో 10MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప ఫోటోలు మరియు వీడియోల కోసం ప్రో విజువల్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4700 బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.