iQOO 15 ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసిన ఐకూ.!
iQOO 15 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం ఐకూ టీజింగ్ మొదలుపెట్టింది
ఈ స్మార్ట్ ఫోన్ ను చైనా లో అక్టోబర్ 20న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ
ఈ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేస్తూ టీజింగ్ మొదలుపెట్టింది
iQOO 15 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం ఐకూ టీజింగ్ మొదలుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చైనా లో అక్టోబర్ 20న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ, ఈ ఫోన్ ఇండియా లాంచ్ గురించి టీజింగ్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కంటే చాలా ముందు ఈ ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ ఈ ఫోన్ డిజైన్ వివరించే ఇమేజ్ తో టీజింగ్ కూడా మొదలుపెట్టింది.
SurveyiQOO 15 ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఐకూ 15 స్మార్ట్ ఫోన్ చైనా లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ ఇండియాలో లాంచ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని మాత్రం ఐకూ కన్ఫర్మ్ చేసింది. కంపెనీ అధికారిక X అకౌంట్ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం టీజింగ్ చేస్తోంది.
iQOO 15 ఫీచర్స్ ఏమిటి?
ఇండియా వేరియంట్ ఫీచర్స్ ఇంకా అనౌన్స్ కాలేదు కానీ చైనా వేరియంట్ కీలక స్పెక్స్ అండ్ ఫీచర్స్ మాత్రం బయటకు వచ్చాయి. కంపెనీ యొక్క అధికారిక చైనా వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్ కీలక స్పెక్స్ మరియు ఫీచర్స్ వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ లను కూడా వివో రివీల్ చేసింది.

ఐకూ 15 స్మార్ట్ ఫోన్ భారీ ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నట్లు ఐకూ అధికారికంగా చెబుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ సూపర్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లో Q3 సూపర్ కంప్యూటింగ్ చిప్ కూడా జాతగా వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ఈ లేటెస్ట్ చిప్ సెట్ మరియు జతగా వచ్చిన చిప్ తో అద్భుతమైన పెర్ఫార్మన్స్ అందిస్తుందని కూడా ఐకూ చెబుతోంది.
ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పెద్ద 8K వేపర్ ఛాంబర్ కూలింగ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ చాలా వేగంగా కూల్ అవుతుందని ఐకూ పేర్కొంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో 7000 mAh భారీ బ్యాటరీ మరియు 100W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 2K రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ కూడా ఉంటుంది.
Also Read: Honor Robot Phone: రోబోట్ పాప్ కెమెరా కలిగిన వింత ఫోన్ ప్రదర్శించిన హానర్.!
ఇక ఈ అప్ కమింగ్ ఐకూ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ముందుగా వచ్చిన ఐకూ 13 ఫోన్ డిజైన్ మాదిరిగా కనిపించినా కొంచెం పెద్దదైన కెమెరా బంప్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక 100x జూమ్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ కూడా త్వరలోనే బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంది.