ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై 14 వేల భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈ బిగ్ డిస్కౌంట్ అందించింది
జెబ్రోనిక్స్ గత నెల ప్రారంభంలో విడుదల చేసిన 1100 W సౌండ్ బార్ Juke Bar 10000 పై ఈ బిగ్ డీల్స్ అందించింది
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈ బిగ్ డిస్కౌంట్ అందించింది. అదేమిటంటే, జెబ్రోనిక్స్ గత నెల ఇండియాలో విడుదల చేసిన డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ పై 14 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ఎన్నడూ లేనంత చవక ధరలో లభిస్తోంది.
SurveyZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్
జెబ్రోనిక్స్ గత నెల ప్రారంభంలో విడుదల చేసిన 1100 W సౌండ్ బార్ Juke Bar 10000 పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ గత నెల ఇండియాలో రూ. 42,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు నుంచి మొదలైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి రూ. 13,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 28,249 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
Also Read: iPhone 16 Pro Price Drop: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఐఫోన్ 16 ప్రో.!
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 7.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు చాలా ప్రీమియం డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్, ముందు మూడు ఫ్రాంట్ ఫైరింగ్ స్పీకర్ మరియు రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన సూపర్ బార్ ఉంటుంది. ఇది కాకుండా ఈ సెటప్ లో ఫ్రాంట్ అండ్ అప్ ఫైరింగ్ స్పెకర్ కలిగిన డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ ఉఫర్ కలిగిన వైర్లెస్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ బార్ టోటల్ 1100W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
సౌండ్ టెక్నాలజీ పరంగా, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫీచర్స్ కాకుండా జెబ్ అకౌష్టి మాక్స్ మల్టీ డైమెన్షనల్ ఆడియో ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ మరియు ఫీచర్స్ తో సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరలో ఈ సౌండ్ బార్ డీల్ బెస్ట్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.