BSNL 5G త్వరలో లాంచ్ కావచ్చు: IMC 2025 నుండి కొత్త అప్‌డేట్ వచ్చింది.!

HIGHLIGHTS

BSNL 5G త్వరలోనే రావచ్చని ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్‌డేట్ ఒకటి హింట్ ఇచ్చింది

అతి పెద్ద టెక్ షో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (IMC 2025) నుంచి ఈ కొత్త అప్‌డేట్ బయటకొచ్చింది

దేశవ్యాప్తంగా 5జి నెట్‌వర్క్ ని విస్తరించడమే తరువాయి లక్ష్యంగా ఉంటుంది

BSNL 5G త్వరలో లాంచ్ కావచ్చు: IMC 2025 నుండి కొత్త అప్‌డేట్ వచ్చింది.!

యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న BSNL 5G త్వరలోనే రావచ్చని ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్‌డేట్ ఒకటి హింట్ ఇచ్చింది. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న అతి పెద్ద టెక్ షో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (IMC 2025) నుంచి ఈ కొత్త అప్‌డేట్ బయటకొచ్చింది. IMC 2025 నుంచి ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం బిఎస్ఎన్ఎల్ 5జి పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. అంటే, నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఫైవ్ జి నెట్‌వర్క్ ని విస్తరించడమే తరువాయి లక్ష్యంగా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL 5G : IMC 2025

నిన్న జరిగిన IMC 2025 రెండో రోజు కార్యక్రమంలో ఈ కొత్త అప్డేట్ బయటికొచ్చింది. బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రిన్సిపుల్ జనరల్ మేనేజర్ (PGM) వివేక్ దువా నిన్న ఈ కొత్త అప్డేట్ అందించారు. బిఎస్ఎన్ఎల్ 5జి పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి చేసినట్లు మరియు ఇది 4G అప్ గ్రేడేషన్ లో భాగంగా నిర్వహించినట్లు తెలిపారు. అంటే, 4G నెట్ వర్క్ ను అప్గ్రేడ్ చేసి 5G గా మార్చినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ఒక దేశంలో ఉన్న 4జి నెట్ వర్క్ ని 5జి గా మార్చడానికి మార్గం సుగమం అయ్యింది.

సెప్టెంబర్ 7వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేశవ్యాప్త 4జి నెట్‌వర్క్ ని బిఎస్ఎన్ఎల్ ఆవిష్కరించింది. ఈ ఆవిష్కరణ సమయంలో కూడా త్వరలోనే బిఎస్ఎన్ఎల్ 5జి నెట్వర్క్ అందుబాటులోకి తీసుకోబోతున్నట్లు ప్రకటన చేశారు. ఇప్పుడు అదే మాటకు కట్టుబడి త్వరలోనే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి బిఎస్ఎన్ఎల్ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

BSNL 5G  IMC 2025

అంతేకాదు, AI సత్తా ని మరింత పెంచడానికి వీలుగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు కూడా IMC 2025 వేదికగా వివేక్ దువా తెలిపారు. తద్వారా భారత AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి మార్గం సుగమం అవుతుందని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read: 780W Dolby Soundbar అమెజాన్ భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తోంది.!

ఈ కొత్త అప్డేట్ ద్వారా అనుకున్న దానికంటే త్వరగా 5జి నెట్ వర్క్ ని విస్తరించే దిశగా బిఎస్ఎన్ఎల్ పనిచేస్తున్నట్లు మనం ఊహించవచ్చు. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జి నెట్వర్క్ మరియు రీఛార్జ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు కొత్తగా eSIM సర్వీస్ మరియు SIM కార్డు డోర్ డెలివరీ సర్వీస్ వంటి వినూత్నమైన సేవలు కూడా బిఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. ఇక మిగిలింది బిఎస్ఎన్ఎల్ 5జి నెట్వర్క్ మాత్రమే కాబట్టి, ఇది కూడా త్వరలో అందుబాటులోకి వస్తే యూజర్లకు చవక ధరలో 5జి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo