Great Indian Festival 2025: డేట్ దగ్గరకు రావడంతో భారీ డీల్స్ అనౌన్స్ చేసిన Amazon.!
Great Indian Festival 2025 బిగ్ డీల్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేయడం స్టార్ట్ చేసింది
ఈరోజు ఇయర్ బడ్స్ మరియు స్మార్ట్ టీవీ డీల్స్ కూడా అమెజాన్ అనౌన్స్ చేసింది
కొత్త టాక్స్ స్లాబ్ తో కూడిన స్మార్ట్ టీవీ డిస్కౌంట్ ఆఫర్స్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది
Great Indian Festival 2025 బిగ్ డీల్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేయడం స్టార్ట్ చేసింది అమెజాన్ ఇండియా. ముందుగా స్మార్ట్ ఫోన్ డీల్స్ అనౌన్స్ చేసిన అమెజాన్ ఇప్పుడు మరిన్ని క్యాటగిరీ నుంచి అందించనున్న డీల్స్ కూడా వెల్లడిస్తోంది. ఈరోజు ఇయర్ బడ్స్ మరియు స్మార్ట్ టీవీ డీల్స్ కూడా అమెజాన్ అనౌన్స్ చేసింది. వాస్తవానికి, ప్రభుత్వం అందించిన కొత్త టాక్స్ స్లాబ్ తో కూడిన స్మార్ట్ టీవీ డిస్కౌంట్ ఆఫర్స్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది.
SurveyGreat Indian Festival 2025:
అమెజాన్ గ్రేట్ ఇండియన్ 2025 సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఈ పండుగ సేల్ 24 గంటల ముందుగా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం స్టార్ట్ అవుతుంది. మీరు ప్రైమ్ మెంబర్ అయితే 22 వ తేదీ నుంచే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ యాక్సెస్ అందుకుంటారు.
Great Indian Festival 2025: టాప్ మొబైల్ డీల్స్?
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ టాప్ డీల్స్ అమెజాన్ అనౌన్స్ చేసింది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్ ప్లస్ 13R, షియోమీ 14 CIVI, రియల్ మీ GT7 ప్రో, నథింగ్ ఫోన్ 3 మరియు ఆపిల్ ఐఫోన్ 15 ఫోన్ డీల్స్ అమితంగా ఆకర్షించే విధంగా ఉన్నాయి.
ఇండియాలో రూ. 1,29,999 రూపాయల ధరతో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 71,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. అలాగే, ఇండియాలో రూ. 79,900 రూపాయల ధరతో విడుదలైన ఐఫోన్ 15 ఫోన్ ను అమెజాన్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 43,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. ఇవి కాకుండా Nothing Phone 3 మరియు ఐఫోన్ 16 వంటి మరిన్ని ప్రీమియం ఫోన్లు కూడా అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తాయని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ 2025: బడ్స్ అండ్ స్మార్ట్ టీవీ ఆఫర్స్?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ 2025 సేల్ నుంచి Bose క్వైట్ కంఫర్ట్ ను రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరకు మరియు సెన్ హైజర్ మూమెంటం 4 రూ. 17,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తాయని అమెజాన్ చెబుతోంది. ఇది కాకుండా వన్ ప్లస్, రియల్ మీ, JBL మరియు Sony వంటి మరిన్ని ఇయర్ బడ్స్ కూడా మంచి ఆఫర్ ధరలో లభిస్తాయని తెలిపింది.

ఇక స్మార్ట్ టీవీల విషయానికి వస్తే, ఈ సేల్ నుంచి Sony, శాంసంగ్, LG, Kodak, Thomson, Vu, Hisense మరియు మరిన్ని బ్రాండ్స్ యొక్క స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్స్ తో తక్కువ ధరలో లభించే అవకాశం ఉందని అమెజాన్ ప్రకటించింది.
Also Read: భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,300 ధరకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!
GST Saving Included: ప్రభుత్వం ఇటీవల GST రేట్లలో గణనీయమైన మార్పులు చేయడం గమనించ దగ్గ విషయం. దీని ఫలితంగా అనేక గాడ్జెట్‌లు మరియు ఎలక్ట్రానిక్ డివైజెస్ ధరలు తగ్గాయి. సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త GST అమల్లోకి వస్తుంది. కాబట్టి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ సమయంలో అన్ని ఉత్పత్తులు కూడా కొత్త GST రేట్లతో అందుబాటులో ఉంటాయి. అంటే, మీరు ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ని 28% టాక్స్ కి బదులుగా 18% GST కి మాత్రమే కొనుగోలు చేయగలుగుతారు.