Samsung Galaxy F17 5G బడ్జెట్ ధరలో గొరిల్లా గ్లాస్ విక్టస్ వంటి భారీ ఫీచర్స్ తో వచ్చింది.!
Samsung Galaxy F17 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది
గొరిల్లా గ్లాస్ విక్టస్ వంటి భారీ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ రాకతో గెలాక్సీ F సిరీస్ మరింత విస్తరించింది
Samsung Galaxy F17 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో గొరిల్లా గ్లాస్ విక్టస్ వంటి భారీ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ రాకతో గెలాక్సీ F సిరీస్ మరింత విస్తరించింది. శామ్సంగ్ సరికొత్తగా ఈరోజే విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveySamsung Galaxy F17 5G : ప్రైస్
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 స్మార్ట్ ఫోన్ ను మూడు ఆప్షన్ లతో అందించింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ధరల లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 (4GB + 128GB) ధర : రూ. 13,999
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 (6GB + 128GB) ధర : రూ. 15,499
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 (8GB + 128GB) ధర : రూ. 16,999
ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి లాంచ్ డీల్స్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను UPI లేదా బ్యాంక్ పేమెంట్ ద్వారా తీసుకునే వారికి రూ. 500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇది కాకుండా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్, Samsung అఫీషియల్ సైట్ మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ నుంచి లభిస్తుంది. ఈ ఫోన్ వయోలెట్ పాప్ మరియు నియో బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది.
Also Read: Amazon GIF Sale: కేవలం రూ. 2,949 ఆఫర్ ధరలో Amazon Echo Pop స్మార్ట్ స్పీకర్ అందుకోండి.!
Samsung Galaxy F17 5G : ఫీచర్స్
ఈ శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేవలం 7.5mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ Super AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ పటిష్టమైన గొరిల్లా గ్లాస్ రక్షణతో అందించింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 స్మార్ట్ ఫోన్ Exynos 1330 5G చిప్ సెట్ తో నడుస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

కెమెరా పరంగా, ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Gemini Live, సర్కిల్ టు సెర్చ్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ 6 సంవత్సరాల OS మరియు సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుందని ప్రామిస్ చేసింది. ఈ ఫోన్ IP54 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.