Cyber Scams నుంచి మీ వ్యక్తిగత డేటా రక్షించుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోండి.!

HIGHLIGHTS

ప్రపంచం మొత్తం ఇప్పుడు సైబర్ మోసాలతో నిండి పోయింది

వ్యక్తిగత సమాచారాన్ని చెక్కించుకోవడానికి ఎక్కువగా స్కామర్లు వల వేస్తూ ఉంటారు

డేటాని డార్క్ వెబ్ లో అమ్మకం చేయడానికి కూడా ఉపయోగిస్తారు

Cyber Scams నుంచి మీ వ్యక్తిగత డేటా రక్షించుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోండి.!

Cyber Scams: ప్రపంచం మొత్తం ఇప్పుడు సైబర్ మోసాలతో నిండి పోయింది. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారాన్ని చెక్కించుకోవడానికి ఎక్కువగా స్కామర్లు వల వేస్తూ ఉంటారు. వ్యక్తి యొక్క పర్సనల్ డేటా చేజిక్కించుకోవడం ద్వారా వారి ఫైనాన్షియల్ వివరాలతో అకౌంట్ ఖాళీ చేయడానికి మరియు లేదా వారి డేటాని డార్క్ వెబ్ లో అమ్మకం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, QR కోడ్ స్క్యామ్, WhatsApp ద్వారా స్కామ్, UPI మరియు పర్సనల్ యాప్స్ ద్వారా కూడా పర్సనల్ డేటా ని దోచుకుంటున్నారు. మరి, ఇలాంటి సైబర్ మోసాలు లేదా స్కామ్స్ నుంచి మీ పర్సనల్ డేటా రక్షించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Cyber Scams నుంచి డేటాని ఎలా రక్షించాలి?

ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది మీ అకౌంట్ కోసం బలమైన పాస్వర్డ్ లను ఉపయోగించండి. ఇది మీ అకౌంట్ ను రక్షించడంలో హ్యాకర్స్ నుంచి రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే, “123456” లేదా “password” లాంటి సింపుల్ పాస్వర్డ్ కాకుండా క్యాపిటల్ లెటర్ మరియు ప్రత్యేకమైన గుర్తులతో కూడిన పాస్వర్డ్ ను సెట్ చేసుకోండి.

ఇప్పుడు కొత్తగా ఉపయోగిస్తున్న రెండు అంచెల ధృవీకరణ (2FA) మీ అకౌంట్ ను రక్షించడంలో కీలకంగా మారింది. WhatsApp, Gmail, బ్యాంక్ యాప్స్‌లో OTP మరియు పాస్వర్డ్ ను ఉపయోగించడం మంచింది. హ్యాకర్లు పాస్వర్డ్ ను చెప్పించుకున్నా 2FA లేకుండా మీ అకౌంట్ ను యాక్సెస్ చేసే అవకాశం ఉండదు.

QR Code స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి

పెమెంట్స్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఎందుకంటే, కొన్ని అక్రమ క్యూఆర్ కోడ్స్ ద్వారా స్కామర్లు UPI, Paytm మరియు PhonePe వంటి యాప్స్ వాలెట్ ద్వారా స్కామ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే, పేమెంట్ సమయంలో ఆథరైజ్డ్ క్యూఆర్ కోడ్ లను మాత్రమే స్కాన్ చేయండి.

Cyber Scams Protect Tips

మీ ఫోన్ లో ఉన్న అన్ని యాప్స్ మరియు OS ను రెగ్యులర్ గా అప్డేట్ చేయడం మంచిది. ఎందుకంటే, అవుట్ డేటెడ్ యాప్స్ లేదా సెక్యూరిటీ తక్కువ ఉన్న యాప్స్ లేదా ఫోన్ లను హ్యాక్ చేయడం స్కామర్లకు సులభంగా ఉంటుంది. అంతేకాదు, పబ్లిక్ Wi-Fi వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ Wi-Fi వాడితే మాత్రం కచ్చితంగా VPN ఉపయోగించండి. అలాగే, షాపింగ్, ఇకార్ట్, బ్యాంకింగ్ మరియు మీ వ్యక్తిగత డేటా వెల్లడించే ఈ లింక్స్ లేదా యాప్స్ ను పబ్లిక్ వైఫై నెట్వర్క్ పై ఓపెన్ చేయకపోవడం మంచిది.

Social Media లో అన్ని వివరాలు పోస్ట్ చేయొద్దు

చాలా మంది వారి సోషల్ మీడియా అకౌంట్ నుంచి వారి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. అయితే, ఇది ఎంతమాత్రమూ సరైన పద్దతి కాదు అని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేయడం మరియు ఆ వివరాలతో మీ కుటుంబ సభ్యులను మభ్య పెట్టడం వంటివి ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే, ఫోటో మరియు వాయిస్ వంటి వాటితో డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి మోసం చేసే ట్రిక్ ను స్కామర్లు ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా వచ్చే గుర్తు తెలియని లింక్స్ [పై క్లిక్ చేయకండి.

Also Read: బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ Realme NARZO 80 Pro 5G పై గొప్ప డిస్కౌంట్ అందుకోండి.!

మీ డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోండి

మీ డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోవడం మంచి అలవాటుగా ఉంటుంది. మీ ఫోన్ లేదా ఇతర డివైజ్ హ్యాక్ లేదా నష్టం కలిగిన సమయంలో మీ డేటా తిరిగి పొందడానికి ఇది సరైన మార్గం అవుతుంది. ఇలా మీరు తీసుకునే జాగ్రత్తలు మీ పర్సనల్ డేటాని ఇతరుల చేతికి చేరకుండా అడ్డుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo