Realme P4 5G లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
Realme P4 5G స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్
7000 mAh బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ ఈ ఫోన్ కలిగి ఉంటుంది
రియల్ మీ పి4 స్మార్ట్ ఫోన్ స్లీక్ బాడీ మరియు సరికొత్త డిజైన్ ఉంటుంది
Realme P4 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా ఒక్కరోజు ఉండగా ఈ రోజే మీకు ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ అందిస్తున్నాను. ఈ స్మార్ట్ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన స్టన్నింగ్ డిస్ప్లే మరియు 7000 mAh బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇండియాలో విడుదలయ్యే డేట్ మొదలుకొని కంప్లీట్ ఫీచర్స్ ఈరోజు తెలుసుకోండి.
SurveyRealme P4 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?
రియల్ మీ పి4 స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ కావడానికి ఇంకా ఒకరోజు ఉండగా ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ఇక్కడ చూడవచ్చు.
Realme P4 5G ఫీచర్స్ ఏమిటి?
రియల్ మీ పి4 స్మార్ట్ ఫోన్ స్లీక్ బాడీ మరియు సరికొత్త డిజైన్ ఉంటుంది. ఈ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన బిగ్ AMOLED డిస్ప్లే ని 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ విజువల్స్ కోసం ప్రత్యేకమైన హైపర్ విజన్ AI చిప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ చిప్ సెట్ కలిగిన ఫోన్ గా లాంచ్ అవుతోంది.

ఈ ఫోన్ 50MP AI మెయిన్ కెమెరా మరియు 8MP సెకండరీ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఎఐ జీని, ఎఐ ట్రావెల్ స్నాప్ వంటి చాలా ఎఐ కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.58mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. అయితే, ఈ ఫోన్ 7000 mAh టైటాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 80W అల్ట్రా ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 12.5W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
రియల్ మీ పి4 స్మార్ట్ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ IP 65 అండ్ IP 66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ మూడు సరికొత్త రంగుల్లో లాంచ్ అవుతుంది.
Also Read: అండర్ రూ. 10,000 ధరలో లభించే బెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv లు ఇవే.!
ఈ ఫోన్ అంచనా ధర ఏమిటి?
రియల్ మీ పి4 5జి స్మార్ట్ ఫోన్ రూ. 17,499 ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.