X (Twitter) Down: పూర్తిగా డౌన్ అయిన ఎలన్ మస్క్ ‘X’ ప్లాట్ ఫామ్.!

HIGHLIGHTS

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X (గతంలో ట్విట్టర్) ఈరోజు ఉదయం నుంచి పూర్తిగా డౌన్ అయ్యింది

ఎలన్ మస్క్ యాజమాన్యంలో రన్ అవుతున్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X

యూజర్లు అందించిన రిపోర్ట్స్ ద్వారా యూజర్ లాగిన్ కూడా ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది

X (Twitter) Down: పూర్తిగా డౌన్ అయిన ఎలన్ మస్క్ ‘X’ ప్లాట్ ఫామ్.!

X (Twitter) Down: ఎలన్ మస్క్ యాజమాన్యంలో రన్ అవుతున్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X (గతంలో ట్విట్టర్) ఈరోజు ఉదయం నుంచి పూర్తిగా డౌన్ అయ్యింది. ఈ ప్లాట్ ఫామ్ డౌన్ విషయాన్ని యూజర్లు ప్రముఖ Ookla యొక్క డౌన్ డిటెక్టర్ ద్వారా రిపోర్ట్ చేస్తున్నారు. సైట్ రియల్ టైమ్ స్పీడ్ మరియు సైట్ డౌన్ వివరాలు రియల్ టైమ్ లో అందించే ఈ ప్లాట్ ఫామ్ నుంచి ఈరోజు X డౌన్ గురించి ఎక్కువగా రిపోర్ట్స్ అందుకుంది. ఇందులో యూజర్లు అందించిన రిపోర్ట్స్ ద్వారా యూజర్ లాగిన్ కూడా ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

X (Twitter) Down:

డౌన్ డిటెక్టర్ లో యూజర్లు X ప్లాట్ ఫామ్ పూర్తిగా డౌన్ అయినట్లు రిపోర్ట్ చేశారు. ఈ ప్లాట్ ఫామ్ వెబ్సైట్ 76 శాతం, యాప్ 24 శాతం మరియు సర్వర్ కనెక్షన్ లో 4 శాతం సమస్యలు చూసినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు. కొందరు యూజర్లు X అకౌంట్ తో లాగిన్ అవ్వడం కూడా కష్టంగా ఉందని కామెంట్స్ అందించారు.

ఈ సమస్య ఇండియాలో తారాస్థాయిలో ఉన్నట్లు సూచించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై మరియు ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోని యూజర్లు ఈ సమస్య గురించి ఎక్కువ రిపోర్ట్ చేస్తున్నారు. ఈ న్యూస్ ను ప్రచురించే సమయానికి కూడా డౌన్ డిటెక్టర్ ఈ సమస్య గురించి రిపోర్ట్స్ అందుకుంటూనే ఉంది.

elon musk X (Twitter) Down

ప్రస్తుతం కూడా వెబ్సైట్ ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడం లేదు అని కొందరు యూజర్లు చెబుతున్నారు. X అకౌంట్ ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నించినప్పుడు కూడా ఇదే సమస్యను చవి చూశాము. మా సిస్టం పై X ఓపెన్ చేసినప్పుడు కొన్ని ప్రైవసీ సంబంధిత ఎక్స్ టెన్షన్ కారణంగా సమస్య తలెత్తి ఉండవచ్చని నోటిఫికేషన్ అందించింది. అయితే, సెట్టింగ్స్ మొత్తం చేంజ్ చేసిన తర్వాత కూడా ఈ సైట్ ఓపెన్ అవ్వకపోవడం గమనార్హం.

Also Read: అండర్ రూ. 10,000 ప్రైస్ సెగ్మెంట్ బెస్ట్ Tablet డీల్స్ కోసం చూస్తున్నారా.!

ఈ విషయంపై X యాజమాన్యం అఫిషియల్ గా ఎటువంటి అప్డేట్ ను ఇంకా అందించలేదు. మరి X ప్లాట్ ఫామ్ లో తలెత్తిన ఈ సమస్య ఎప్పటి వరకు సరి చేయబడుతుందో చూడాలి. మీరు కూడా ఈ సమస్య ను మీ అకౌంట్ పై చూస్తుంటే, సమస్య ముగిసే వరకూ వేచి చూడాల్సి వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo