Infinix Smart 10: బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో ల్యాగ్ ఫ్రీ ఫోనుగా వస్తుందని కంపెనీ టీజింగ్.!
బడ్జెట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ నుంచి ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది
ఇది కూడా బడ్జెట్ సిరీస్ నుంచి లాంచ్ అవుతుంది మరియు ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది
ఎక్కువ కాలం ల్యాగ్ ఫ్రీ అనుభూతిని అందించే ఫోను గా ఉంటుందని కంపెనీ టీజింగ్ చేస్తోంది
Infinix Smart 10: ఇండియాలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తూ బడ్జెట్ ఫోన్ బ్రాండ్ గా మంచి పేరు సంపాదించుకున్న ఇన్ఫినిక్స్ నుంచి ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది కూడా బడ్జెట్ సిరీస్ నుంచి లాంచ్ అవుతుంది మరియు ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చినా కూడా ఎక్కువ కాలం ల్యాగ్ ఫ్రీ అనుభూతిని అందించే ఫోను గా ఉంటుందని కంపెనీ టీజింగ్ చేస్తోంది.
SurveyInfinix Smart 10: లాంచ్ డేట్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో జూలై 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ఇన్ఫినిక్స్ డేట్ కన్ఫర్మ్ చేసింది. కేవలం డేట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా ఇన్ఫినిక్స్ ముందే వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా తీసుకొస్తోంది మరియు లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Infinix Smart 10: ఫీచర్లు
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 ఫోన్ నాలుగు సంవత్సరాల ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందించే ఫీచర్స్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది ల్యాగ్ ఫ్రీ పర్ఫామెన్స్ అందించే Unisoc T7250 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో వస్తుందిట. ఇందులో, TUV సర్టిఫైడ్ 4 సంవత్సరాల ల్యాగ్ ఫ్రీ 6.7 ఇంచ్ స్క్రీన్ ఉన్నట్లు ఇన్ఫినిక్స్ పేర్కొంది. ఇది 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన AI బటన్ ఉంటుంది మరియు DTS సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ స్పీకర్లు కూడా అందించింది.

ఈ ఫోన్ లో 8MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2K వీడియో, డ్యూయల్ వీడియో సపోర్ట్ మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ ను XOS 15 సాఫ్ట్ వేర్ తో క్లీన్ ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: Nothing Phone (3a) పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ అందుకోండి.!
ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ నిర్వహించిన డ్రాప్ టెస్ట్ గురించి గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ ను 1.5 మీటర్ల ఎత్తు నుండి ఆరు వైపులా డ్రాప్ టెస్ట్ చేసినట్లు కంపెనీ గొప్పగా చెచెబుతోంది. ఈ ఫోన్ 25 వేలకు పైగా డ్రాప్ టెస్ట్ తట్టుకున్నట్లు ఇన్ఫినిక్స్ పేర్కొంది.