VIRAT V1 Pro 5G Sale starts from today 12pm with big deals
VIRAT V1 Pro 5G Sale: ప్రముఖ ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. మొదటి రోజు సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ని గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో అందుకునే అవకాశం కొనుగోలుదారులకు అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ అండ్ ఆఫర్లు ఏమిటో తెలుసుకుందామా.
వివో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ని కేవలం రూ. 15999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ని కేవలం 6GB + 128GB సింగిల్ వేరియంట్ లో మాత్రమే అందించింది. ఈ ఫోన్ మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవుతుంది.
ఇక ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ పై లావా అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ నుండి SBI మరియు HDFC క్రెడిట్ కార్డు తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి 2000 రూపాయలు భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తుంది. అంటే, ఈరోజు ఈ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్స్ తో కేవలం రూ. 13,999 రూపాయల అతి చవక ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: Xiaomi Smart Tv పై ఫ్లిప్ కార్ట్ సూపర్ డిస్కౌంట్ అందుకోండి: ఆఫర్ ప్రైస్ ఎంతంటే.!
వివో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇటీవల విడుదల చేసిన వివో విరాట్ వి1 యొక్క అప్గ్రేడ్ వెర్షన్ గా అందించింది. ఈ ఫోన్ లో లేటెస్ట్ బడ్జెట్ 5జి చిప్ సెట్ Unisoc T8200 ని అందించింది. అలాగే, ఈ ఫోన్ లో 6GB ఫిజికల్ అండ్ 6GB వర్చువల్ ర్యామ్ ను కూడా అందించింది. ఈ ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కూడా అఫర్ చేసింది. ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 16 OS తో పని చేస్తుంది మరియు అప్ కమింగ్ ఆండ్రాయిడ్ OS అప్డేట్ కూడా అందుకుంటుంది.
ఈ ఫోన్ 6.74 ఇంచ్ LCD స్క్రీన్ ని HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ ఉంది మరియు ముందు సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో కూడా లావా ఉచిత హోమ్ సర్వీస్ ఫెసిలిటీ అందించింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.