ఇప్పుడు, స్మార్ట్ ఫోన్లు ఒక కంప్యూటర్ తో పోటీపడేలా అన్ని ప్రత్యేకతలను సంతరించుకుంటున్నాయి. శక్తి వంతమైన ప్రొసెసర్లు, పెద్ద స్క్రీన్స్, అతి పెద్ద ర్యామ్ మరియు స్టోరేజిలతో ఇవి మరింత సౌకర్యవంతంగా మారుతున్నాయి. ఇక ఈ ఇటీవల వీటిలో అందిస్తున్న డిస్ప్లేలు వీటిలో చూసే కంటెంట్ యొక్క రిచ్ నెస్ ని మరింతగా పెంచేశాయి. అయితే, ఒక స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే యొక్క డిస్ప్లే ఎంత Hz లలో ఉంటే మంచి, 60Hz మరియు 120Hz మధ్యగల వ్యత్యాసం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం.
మనం వాడే స్మార్ట్ ఫోన్లలో ఉండే స్క్రీన్ (డిస్ప్లే) యొక్క చిత్ర కొలతలను రిఫ్రెష్ రేటు Hz లలో కొలుస్తారు. అంటే, ఒక సెకనుకు డిస్ప్లే రిఫ్రెష్ చేసే ఫ్రెమ్ రేటును Hz లలో కొలుస్తారు. అంటే, ఒక వీడియో లేదా యానిమేషన్ మనం చూస్తున్నప్పుడు సెకనుకు మన స్క్రీన్ చేసే రిఫ్రెష్ రేటు కారణంగా మనం చూసే కంటెంట్, బ్లర్ లాగా లేదా చాలా స్పష్టంగా కనిపించడం వంటి లాభాలను ఇస్తుంది.
ప్రస్తుతం, దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లలో 60Hz రిఫ్రెష్ రేటు కలిగిన డిస్ప్లేలను అందిస్తున్నారు. అంటే, ప్రస్తుతం మనం వాడుతున్న ఫోను 60Hz రిఫ్రెష్ రేటుకలిగిన డిస్ప్లే గా మనం చెప్పవచ్చు. ఒకవేళ మీరు ప్రత్యేకంగా 90 లేదా 120Hz రిఫ్రెష్ రేటు డిస్ప్లే కలిగిన స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేస్తే తప్పక మిగిలినవి ఈ కోవకే చెందుతాయి.
వాస్తవానికి, మనం చూసే కంటెంట్ 24fps తో ఉంటుంది. ఇది నేరుగా 24Hz గా మాత్రం ఉండదు. అందుకే, 60Hz డిస్ప్లేలు బ్లూ-రే కంటెంట్ ను ప్లే చెయ్యడానికి కొంచెం ఇబ్బంది పడతాయి మరియు ఇవి కంటెంట్ ను విడివిడిగా మార్చి మనకు తక్కువ ఫ్రెమ్స్ తో చూపిస్తాయి. అందుకే మనకు ఈ 60Hz డిస్ప్లేల పైన రేసింగ్, వేగంగా నడిచే మూవీస్ వంటివి పూర్తి స్వచ్చతతో చూపించలేవు. కానీ, మనం సాధారణంగా చూసే కంటెంట్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ఉంటుంది.
ప్రస్తుతానికి, కొన్ని స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఈ డిస్ప్లేని అఫర్ చేస్తున్నాయి. వీటిలో కంటెంట్ చూడడం నిజంగా పీక్స్ లో వుంటుంది. ఇది 24fps కంటెంట్ ను నేరుగా మరియు పూర్తి స్వచ్చతతో ప్రసారం చేస్తుంది. ఇక ఈ 120Hz డిస్ప్లేలో బ్లూ-రే వీడియోలు చాలా సున్నితంగా మరియు ఎటువంటి షట్టర్ లేకూండా ప్లే చేస్తుంది. ఇక గేమింగ్ విషయానికి వస్తే, ముఖ్యంగా PUBG వంటి గేమ్స్ ని అత్యధికమైన గ్రాఫిక్స్ తో అల్ట్రా హై డెఫినేషన్ లో ఆడవచ్చు. అంతేకాదు, మీకు ఈ డిస్ప్లే ఎక్కువ ఫ్రెమ్ రేటుతో ఉంటుంది కాబట్టి, ఎటువంటి లాగ్ మీకు కనిపించదు.