Fire-Boltt Royale: 4GB మ్యూజిక్ స్టోరేజ్ తో New Smart Watch లాంచ్.!

HIGHLIGHTS

ఫైర్ - బోల్ట్ నుండి మరొక స్మార్ట్ వాచ్ ఇండియన్ మార్కెట్ అడుగుపెట్టింది

Fire-Boltt Royale Smart Watch 4GB మ్యూజిక్ స్టోరేజ్ తో విడుదల

ఈ కొత్త స్మార్ట్ వాచ్ పేరుకు తగ్గట్టుగానే రాయల్ గా కనిపిస్తుంది

Fire-Boltt Royale: 4GB మ్యూజిక్ స్టోరేజ్ తో New Smart Watch లాంచ్.!

ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఫైర్ – బోల్ట్ నుండి మరొక స్మార్ట్ వాచ్ ఇండియన్ మార్కెట్ అడుగుపెట్టింది. అదే, Fire-Boltt Royale Smart Watch మరియు ఈ స్మార్ట్ వాచ్ 4GB మ్యూజిక్ స్టోరేజ్ తో అకట్టుకుంటుంది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ పేరుకు తగ్గట్టుగానే రాయల్ గా కనిపిస్తుంది మరియు రాయల్ ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఫైర్ – బోల్ట్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ధర మరియు ఈ వాచ్ ఫీచర్స్ తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Fire-Boltt Royale Smart Watch Price

ఫైర్ – బోల్ట్ కొత్త స్మార్ట్ వాచ్ రాయల్ ను రూ. 4,999 లాంచ్ ప్రైస్ తో మార్కెట్ లో విడుదల చేసింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ వాచ్ ను నవంబర్ 25 వ తేదీ విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, ఫైర్ – బోల్ట్ అధికారిక వెబ్సైట్ నుండి పూర్తి వివరాలతో టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది.

Also Read : Facebook మరియు Instagram కోసం AI ఆధారిత వీడియో ఎడిటింగ్ ఫీచర్ తెచ్చిన Meta.!

ఫైర్ – బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతలు

ఇక ఫైర్ – బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది 466×466 హై రిజల్యూషన్ అందించ గల 1.43 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 750 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కూడా vas వస్తుంది. అంటే, ఈ వాచ్ లో అద్భుతమైన కలర్స్ ను హై బ్రైట్నెస్ లో ఆస్వాదించవచ్చు. ఈ వాచ్ గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ ను కలిగి వుంది. ఇందులో టచ్ కంట్రోల్స్ పాటుగా 3 కంట్రోల్ బటన్స్ కూడా ఉన్నాయి. ఇవి మరింత అందమైన లుక్ తో పాటుగా ఈజీ కంట్రోల్ కోసం కూడా అనువైనవిగా ఉంటాయి. ఇందులో లగ్జరి పుష్ బటన్ కూడా వుంది.

Fire-Boltt Royale Smart Watch specs
ఫైర్ – బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్

ఈ స్మార్ట్ వాచ్ వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో 300+ స్పోర్ట్స్ మోడ్స్ మరియు 130+ ఇన్ బిల్ట్ వాచ్ ఫేస్ లను కూడా అందించింది. ఈ వాచ్ 380 mAh బ్యాటరీ, ఫైర్ బోల్ట్ హెల్త్ సూట్, క్యాలికులెటర్, ఫైండ్ ఫోన్ కెమేరా కంట్రోలర్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

Fire-Boltt Royale Smart Watch color options
ఫైర్ బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్

ఫైర్ బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్ 5 అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ పూర్తిగా మెటల్ తో డిజైన్ చెయ్యబడింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo