Xiaomi S Mini LED series launch announced with quantum MagiQ display technology
Xiaomi S Mini LED: షియోమీ ప్రీమియం స్మార్ట్ టీవీ సిరీస్ నుండి కొత్త టీవీలు లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు క్వాంటం MagiQ డిస్ప్లే టెక్నాలజీతో లాంచ్ అవుతాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ సిరీస్ ను అమెజాన్ ఇండియా ద్వారా షియోమీ టీజింగ్ చేసింది. అంతేకాదు, ఈ టీవీల ప్రత్యేకతలు తెలిపే కొని డీటెయిల్స్ కూడా టీజర్ పేజీ నుంచి అందించింది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ సిరీస్ ను ఏప్రిల్ 15వ తేదీ ఇండియన్ మార్కెట్లో పరిచయం చేస్తున్నట్లు షియోమీ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ సిరీస్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు రివీల్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కొన్ని వివరాలు కూడా ఇదే నుంచి పేజీ వెల్లడించింది.
షియోమీ లాంచ్ చేస్తున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ టీవీలు మినీ ఎల్ఈడి డిస్ప్లే కలిగి ఉంటాయి. అంటే, సాధారణ టీవీలలో ఉండే ఎల్ఈడి లైట్స్ కంటే కూడా మరింత చిన్నవైన ఎల్ఈడి లైట్లు కలిగి ఉంటాయి. ఈ సెట్ అప్ ద్వారా ఈ టీవీ సాధారణ ఎల్ఈడి మరియు క్యూలెడ్ టీవీల కంటే కూడా మరింత స్ఫుటమైన మరియు డీప్ కలర్స్ అండ్ బ్లాక్స్ తో గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది.
అదనంగా, ఈ స్మార్ట్ టీవీలు పగటిపూట కూడా స్పష్టంగా చూడగలిగేంత బ్రైట్నెస్ తో ఉంటాయని టీజర్ లో తెలిపింది. ఈ టీవీలు కలిగిన ఎల్ఈడి కంట్రోల్ చేసే గొప్ప ప్రోసెసర్ తో తగిన బ్రైట్నెస్ మరియు డీప్ బ్లాక్స్ ఈ టీవీలలో చూడొచ్చని కూడా షియోమీ పేర్కొంది. సరైన స్థానంలో ఉంచిన వేలకొద్దీ మినీ ఎల్ఈడి లైట్లను మంచి బ్రిలియన్స్ తో నడిపించే షియోమీ నెక్స్ట్ జనరేషన్ డిస్ప్లే టెక్నాలజీ Quantum MagiQ తో వస్తుంది.
Also Read: Realme Buds T500 Pro స్టైలిష్ లుక్ అండ్ LHDC వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది.!
కేవలం డిస్ప్లే విజువల్స్ మాత్రమే కాదు ఈ విజువల్స్ కి తగిన గొప్ప సౌండ్ అందించే స్పీకర్ సెటప్ తో కూడా ఈ టీవీ సిరీస్ ఉంటుందని షియోమీ తెలిపింది. ఈ టీవీలు బెజెల్ లెస్ స్క్రీన్ తో చాలా అందమైన డిజైన్ తో కోడోత్ ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా ఈ టీవీలు లేటెస్ట్ టెక్నాలజీ డిస్ప్లే మరియు గొప్ప సౌండ్ అందించే సౌండ్ ఫీచర్స్ తో లాంచ్ అవుతాయని మనం భావించవచ్చు.