ఇప్పటికే పండుగ సీజన్ స్టార్టింగ్ సైరన్ మొదలయ్యింది. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ అప్ కమింగ్ సేల్ డేస్ మరియు ఆఫర్లతో ఉదర కొడుతున్నాయి. అయితే, ఈ పండుగ సేల్ కంటే ముందే ఒక గొప్ప బ్రాండెడ్ Smart Tv ఆఫర్ అందుబాటులో వుంది. అదేమిటంటే, కేవలం 7 వేల రూపాయల ధరలోనే బ్రాండెడ్ 32 ఇంచ్ Smart Tv అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా సూపర్ Smart Tv ఆఫర్?
కొడాక్ ఇటీవల విడుదల చేసిన 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘32SE5001BL’ ఈ రోజు 46% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లు 10% అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 7,250 రూపాయల ధరకు లభిస్తుంది.
ఈ కొడాక్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD Ready రిజల్యూషన్ కలిగిన IPS LED ప్యానల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 512 MB మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి బ్రెట్ విజువల్స్ అందిస్తుంది. అయితే, ఈ స్మార్ట్ టీవీ Netflix మరియు Disney+ Hotstar తప్ప మిగిలిన అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ లో 30W సౌండ్ అందించే రెండు స్పీకర్లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ టీవీ DTS Trusurround సపోర్ట్ మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ Linux OS పై నడుస్తుంది. ఈ టీవీ HDMI, HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile