Thomson Jio TV: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటోంది.!

Updated on 25-Feb-2025
HIGHLIGHTS

జియో యొక్క జియో టీవీ OS తో థామ్సన్ కొత్త స్మార్ట్ టీవీని అందించింది

Thomson Jio TV బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది

ఈ టీవీని మరింత చవక ధరకు అందుకునే భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ని కూడా జత చేసింది

Thomson Jio TV: రిలయన్స్ జియో యొక్క జియో టీవీ OS తో థామ్సన్ కొత్త స్మార్ట్ టీవీని అందించింది. ఇప్పటికే దేశంలో బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో చాలా స్మార్ట్ టీవీ లను అందించిన ఈ ఫ్రెంచ్ బ్రాండ్, ఇప్పుడు జియో తో జతకట్టింది. ఇండియాలో జియోకి ఉన్న ప్రాబల్యం మరియు సోర్స్ లను దృష్టిలో ఉంచుకుని ఈ టీవీ అందించినట్లు కనిపిస్తోంది. అన్ని ఆఫర్స్ కలిపి ఈ స్మార్ట్ టీవీ కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే గొప్ప ఛాన్స్ కూడా అందించింది.

Thomson Jio TV: ప్రైస్

ఈ థామ్సన్ జియో టీవీ కేవలం రూ. 18,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో Flipkart నుంచి సేల్ అవుతోంది. అయితే, ఈ టీవీని మరింత చవక ధరకు అందుకునే భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ని కూడా జత చేసింది. అవేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,899 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, HDFC మరియు BOBCARD క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి కూడా రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ తో పాటు 3 నెలల JioHotStar ఉచిత సబ్ స్క్రిప్షన్, 1 నెల JioSaavn, 1 నెల జియో గేమ్స్ మరియు రూ. 150 రూపాయల Swiggy కూపన్ కూడా ఆఫర్ చేస్తోంది.

Also Read: Realme P3 Pro 5G First Sale: భారీ ఆఫర్స్ తో రియల్ మీ కొత్త ఫోన్ మొదటి సేల్.!

Thomson Jio TV: ఫీచర్స్

ఈ థామ్సన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన 4K UHD రిజల్యూషన్ QLED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ ARM Cortex A53 చిప్ సెట్ తో వస్తుంది మరియు జతగా 2GB ర్యామ్ టి పాటు 8 GB స్టోరేజ్ సపోర్ట్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీ Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు బాక్స్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ Jio TV OS పై నడుస్తుంది మరియు 400+ లైవ్ ఛానల్స్ మరియు 400+ జియో గేమ్స్ ఆఫర్ చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :